పార్టీ నైట్ లో మ‌త్తుగా స్టార్ డాట‌ర్స్.. ఇంత‌కీ అతడెవ‌రు?

Update: 2022-08-24 05:44 GMT
ముంబైలో నైట్ పార్టీ క‌ల్చ‌ర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. క‌ర‌ణ్ జోహార్ ఈ పార్టీల‌కు గురువుగా ఉన్నార‌ని భావించినా.. ముంబై సెలబ్రిటీ ప్ర‌పంచంలో ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణంగా చూస్తూనే ఉంటాం. ఇక స్టార్ డాట‌ర్స్ నైట్ పార్టీల‌కు సంబంధించిన వివ‌రాలు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ఓపెన్ గానే వెల్ల‌డ‌వుతున్నాయ్.

ముంబై న‌గ‌రంలో న‌ట‌వార‌సురాళ్లు నిరంత‌రం పార్టీల్లో చిలౌట్ చేయ‌డం చూస్తూనే ఉన్నాం. పార్టీ క్రౌడ్ నుంచి ఫోటోలు అంత‌ర్జాలంలో వేడెక్కిస్తుంటాయి. కొన్ని వారాల క్రితం జాన్వీ కపూర్ - నైసా దేవగన్ ఆమ్ స్టర్ డామ్ (బ్రిట‌న్) లో కొంద‌రు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు.

గత ఆదివారం జాన్వీ కపూర్ - నైసా ముంబైలో పార్టీలో కనిపించారు. ఆ పార్టీ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ పార్టీలో నైసా స్నేహితుడు ఓర్హాన్ అవత్రామణి క‌నిపించాడు. భామ‌లంతా ఓర్హాన్ తో చిల్లింగ్ గా ఉన్న ఫోటోలు సంచ‌ల‌నంగా మారాయి. ఓర్హాన్ స్వ‌యంగా ఇన్ స్టాగ్రామ్ లో పార్టీ ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి.

ఈ ఫోటోగ్రాఫ్స్ లో జాన్వీ కపూర్ బ్లాక్ అండ్ బ్లాక్ లో క‌నిపించింది ..నైసా డెనిమ్ స్కర్ట్ - బ్లూ హాల్టర్ నెక్ టాప్ ధరించగా త‌న చెంత‌నే ఉన్న ఓర్హాన్ పంజాబీ సింగ‌ర్ త‌ర‌హాలో  బ్లాక్ లో ఎంతో స్పైసీగా క‌నిపిస్తున్నాడు. పార్టీ ఆద్యంతం చిరున‌వ్వులు చిందిస్తూ స్టార్ డాట‌ర్స్ ఎంతో రొమాంటిక్ గా క‌నిపించారు.

ముంబై నైట్ పార్టీల్లో ఎక్కువ‌గా చిలౌట్ అయ్యే భామ‌ల జాబితాను ప‌రిశీలిస్తే.. క‌పూర్ డాట‌ర్స్ ఖాన్ డాట‌ర్స్ టాప్ లిస్ట్ లో ఉన్నారు. జాన్వీ కపూర్ - సారా అలీ ఖాన్- అనన్య పాండే- సుహానా ఖాన్ - సాన‌యా క‌పూర్ - ఖుషీ క‌పూర్- నైసా దేవ‌గ‌న్ త‌దిత‌రులు నిరంత‌రం పార్టీల్లో చిలౌట్ చేయ‌డం చూస్తున్న‌దే.
Tags:    

Similar News