వెండితెరపై ఒక వెలుగు వెలిగిన సీనియర్ స్టార్ హీరోలు, సహజంగానే తమ వారసులను కూడా తెరకి పరిచయం చేస్తుంటారు. ఉత్తరాదిన .. దక్షిణాదిన ఈ ఆనవాయితి చాలాకాలం నుంచి వస్తున్నదే. అయితే స్టార్ హీరోల వారసులుగా వాళ్ల పరిచయం ఈజీ అయినా, టాలెంట్ ఉన్నవాళ్లే ఇక్కడ నిలబడతారనేది చాలామంది విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బయటి నుంచి వచ్చిన కుర్ర హీరోలు చకచకా ఎదిగిపోతుంటే, హీరోలుగా సరైన క్రేజ్ కోసం ఎదురుచూసే వారసులు లేకపోలేదు. కోలీవుడ్ లోని కొంతమంది వారసులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
కోలీవుడ్ లో రెబల్ స్టార్ ఇమేజ్ తో ఒకప్పుడు సత్యరాజ్ దడదడలాడించారు. సత్యరాజ్ తో సినిమా చేస్తే చాలానే దర్శకులు చాలామంది ఉండేవారు. ఆయన సినిమాలు కొన్ని అనువాదాలుగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాయి. ఆయన తనయుడు 'శిబిరాజ్' కోలీవుడ్ తెరకి పరిచయమై చాలాకాలమే అయింది. అయినా ఇంతవరకూ ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోలేకపోయాడు. ఇక శివాజీ గణేశన్ మనవడిగా .. ప్రభు తనయుడిగా పరిచయమైన 'విక్రమ్ ప్రభు' పరిస్థితి కూడా ఇందుకు బిన్నంగా ఏమీ లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థానానికి చాలా దూరంలోనే ఉండిపోయాడు.
హీరో మురళి కి తమిళనాట అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఆయన తమిళ సినిమా ఒకటి తెలుగులో 'హృదయం' పేరుతో విడుదలై, ఇక్కడి యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఆయన తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన 'అధర్వ మురళి' కూడా స్టార్ డమ్ కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. కుర్రాడు బాగుంటాడు .. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి .. కానీ అదృష్టమే కలిసిరావాలి. ఆ మధ్య వచ్చిన 'గద్దలకొండ గణేశ్' ద్వారా ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు.
తెలుగులో 'అభినందన' సినిమాతో అమ్మాయిల మనసులు దోచేసిన కార్తీక్, తమిళంలో ఒక రేంజ్ లో దూసుకుపోయాడు. మణిరత్నం సినిమాతో పరిచయమైన ఆయన తనయుడు 'గౌతమ్' మాత్రం ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఇక విక్రమ్ తనయుడు 'ధృవ్' కూడా 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆడియన్స్ ను అంతగా ప్రభావితం చేయలేకపోయాడు. అతణ్ణి హీరోగా నిలబెట్టడానికి విక్రమ్ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. నట వారసత్వమనేది కొత్త కాకపోయినప్పటికీ, ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు .. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అందువల్లనే అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ, స్టార్ హీరోల వారసులు స్ట్రగుల్ ఫేస్ చేయక తప్పడం లేదు.