సన్నీ.. ఒకటి రెండు కాదు 27

Update: 2016-01-10 15:30 GMT
27 అంటే.. ఇదేం సన్నీ లియోన్ పోర్న్ సినిమాల లెక్కేం కాదు. తన కొత్త సినిమాలో సన్నీ ధరించిన బికినీల లెక్క. పోర్న్ సినిమాల్లో సన్నీని నగ్నంగానే చూసేశాక.. మళ్లీ ఈ బికినీ అందాల కోసం ఎగబడే వాళ్లెవరు అని తేలిగ్గా తీసి పడేయకండి. అలా దాచి దాచకుండా అందాల్ని ప్రదర్శిస్తేనే మన ఆడియన్సుకి కిక్కు. ఆ సంగతి గ్రహించే సన్నీతో ‘మస్తీ జాదే’ సినిమాలో 27 బికినీలు వేయించాడట డైరెక్టర్. మనం ఇప్పటికే చాలామంది హీరోయిన్లను బికినీల్లో చూశాం. ఐతే బికినీల్లో రకాలేంటన్నది మాత్రం మనకు అవగాహన లేదు. ఇప్పుడా విషయంలో సన్నీ మనకు క్లాస్ తీసుకోబోతోందన్నమాట.

ఇందులో ఒక్కో బికినీ ఒక్కోలా ఉంటుందని.. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల బికినీల్ని ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం చేస్తూ సన్నీ అందాల విందు చేయబోతోందని ‘మస్తీ జాదే టీం చెబుతోంది. కొంచెం పద్ధతిగా ఉండే హీరోయిన్లే బికినీ వేసేస్తుంటే.. ఇక సన్నీ ఒకటి రెండు బికినీలు వేస్తే ఆమె ప్రత్యేకత ఏముంది చెప్పండి. అందుకే ఏకంగా 27 బికినీలతో కనువిందు చేయబోతోంది ఈ ఇండో-కెనడియన్ బ్యూటీ. ఈ నెల 29న ‘మస్తీ జాదే’ రసిక ప్రియుల ముందుకు రానుంది. ఇండియన్ సినిమాలో ఎన్నడూ చూడని, వినని బూతు కంటెంట్ తో తెరకెక్కింది ఈ చిత్రం. ఆ మధ్య ‘గ్రాండ్ మస్తీ’కే జనాలు కళ్లు, చెవులు మూసుకున్నారు. ‘మస్తీ జాదే’ దాని తలదన్నేలా తెరకెక్కిందని దీని పోస్టర్లు, ట్రైలర్లు చూస్తేనే జనాలకు అర్థమైంది.
Tags:    

Similar News