చరణ్‌ కి రాస్తూ కళ్యాణ్‌ కి ఓకే చెప్పా

Update: 2015-08-24 16:12 GMT
రవితేజ కిక్‌2 పై ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చాయి. కానీ వీకెండ్‌ వసూళ్లు బావున్నాయన్న టాక్‌ వచ్చింది. సక్సెస్‌పై సురేందర్‌ రెడ్డి ఏం చెప్పారంటే..?

=కిక్‌ 2 వసూళ్లు బావున్నాయి. రేసుగుర్రం తరహాలో వసూలు చేస్తోందీ సినిమా. టీమ్‌ హ్యాపీ.

=రామ్‌ చరణ్‌ కి కథ రాసుకుంటున్నప్పుడు, కళ్యాణ్‌ రామ్‌ కలిసి కిక్‌2 చేద్దామన్నారు. వెంటనే మొదలెట్టేశాం. అసలు కల్యాణ్‌ రామ్‌ లేకపోతే ఈ సినిమా లేనేలేదు. రవితేజ ఎనర్జీ పెద్ద ప్లస్‌ అయ్యింది.

=షూటింగ్‌ 2నెలల్లోనే పూర్తయినా రిలీజ్‌ ఆలస్యమవ్వడానికి కారణం పోస్ట్‌ ప్రొడక్షన్‌. డిఐ, అనువాద కార్యక్రమాలు లేటయ్యాయి. రిలీజ్‌ చేద్దాం అనుకోగానే బాహుబలి రిలీజైంది. అందుకే ఆగష్టు వరకూ వేచి చూశాం.

=కిక్‌ తండ్రి కథ, కిక్‌2 కొడుకు కథ. ఆరంభం నుంచి టైటిల్‌ కిక్‌ 2 అనే అనుకున్నాం. కిక్‌ లో కామెడీ ఉంటుంది. కిక్‌2లో దాంతో పాటు ఎమోషన్‌ క్యారీ చేశాం. ఇది కాస్త కష్టమైనది.

=సినిమా లెంగ్త్‌ ఎక్కువైంది అన్నారంతా. అందుకే ద్వితీయార్థంలో కోత కోశాం. ఇప్పుడు మరింత బావుందన్నారు.

=బడ్జెట్‌ ముందుగా మాట్లాడుకునే సినిమా మొదలెట్టాం. బడ్జెట్‌ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే.

=కిక్‌ 3 చేస్తాం. అంతకంటే ముందే రేసుగుర్రం 2 చేయాలనుంది. కుదిరితే రెండూ చేస్తాను.

=మన హీరోలు ముందుకొస్తే మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలు చేస్తాం. హీరోలు కూడా ముందుకొస్తున్నారు. అందరు దర్శకుల్లానే నాక్కూడా బాండ్‌ తరహా సినిమాలు చేయాలనుంది.

=చరణ్‌ ని కలిసి కథ చెప్పాలనుకుంటున్నా. కోన వెంకట్‌ వద్ద కథ ఉంది. తుది నిర్ణయం చరణ్‌ దే.

Tags:    

Similar News