వార‌సుడితో మ‌హేష్ డైరెక్ట‌ర్‌ సినిమా

Update: 2022-04-13 07:23 GMT
టాలీవుడ్ లో వార‌సుల హంగామా గ‌త కొన్నేళ్లుగా సాగుతూనే వుంది. ఇప్ప‌టికే హీరోల వార‌సులు, డైరెక్ట‌ర్ల వార‌సులు, నిర్మాత‌ల వార‌సులు ఇండ‌స్ట్రీలో హీరోలుగా మాంచి ఫామ్ లో వున్నారు. త్వ‌ర‌లో మ‌రో వార‌సుడి తెరంగేట్రానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా క్రేజ్ తో పాటు భారీ స్థాయిలో మార్కెట్ ని విస్త‌రించిన నేప‌థ్యంలో ఏ హీరో సినిమా అయినా ఇట్టే బిజినెస్ అయిపోతోంది. దీంతో కొత్త వాళ్లు కూడా రంగంలోకి దిగేస్తూ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

ఇప్ప‌టికే స్టార్ ప్రొడ్యూస‌ర్, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి. సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. `అహింస‌` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే త్వ‌ర‌లో మ‌రో స్టార్ ప్రొడ్యూస‌ర్ వార‌సుడు హీరోగా తెరంగేట్రం చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ సైలెంట్ గా జ‌రిగిపోతున్నాయి. ఇటీవ‌ల నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన చిత్రం `అఖండ‌`. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుకు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించి మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ త‌రువాత ఆయ‌న కొత్త హీరోని పరిచ‌యం చేస్తూ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త‌ను ఎవ‌రు? ఎవ‌రి వార‌సుడు అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి సస్పెన్స్ అని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన క‌థ‌ని ఇప్ప‌టికే పూర్తి చేసిన శ్రీ‌కాంత్ అడ్డాల త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ని చేయ‌బోతున్నార‌ని తెలిసింది. శ్రీ‌కాంత్ అడ్డాల గ‌త ఏడాది `నారప్ప‌` చిత్రంతో సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఇది త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్‌` రీమేక్ కావ‌డం.. వెంక‌టేష్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో ఈ విజ‌యం పూర్తిగా వెంకీ మామ ఖాతాలోకి వెళ్లింది.

ఈ మూవీ త‌రువాత వెంట‌నే కొత్త హీరోతో సినిమా చేసి సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న త‌రువాతే స్టార్ హీరోతో శ్రీ‌కాంత్ అడ్డాల సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. అందుకే కొత్త హీరోతో సినిమా కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, ఈ మూవీ త‌రువాత స్టార్ హీరోతో స‌రికొత్త క‌థ‌తో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News