సురేష్‌ రైనా ఆమెతో డేటింగ్‌ చేయాలనుకున్నాడట!

Update: 2020-02-20 23:30 GMT
పలువురు క్రికెట్‌ స్టార్స్‌ హీరోయిన్స్‌ తో డేటింగ్‌.. లవ్‌ కొనసాగించిన విషయం తెల్సిందే. కొందరు పెళ్లి వరకు వెళ్లగా కొందరు మాత్రం డేటింగ్‌ ప్రేమ వరకే ఆగిపోయారు. రెండు మూడు దశాబ్దాలుగా క్రికెట్‌.. సినిమా రంగంకు మద్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా రెండు మూడు ప్రేమ కథలు నడుస్తున్నాయి. ఆ విషయాలను పక్కన పెడితే టీం ఇండియా ఆటగాడు సురేష్‌ రైనా గతంలో ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాలీ బింద్రెతో  డేటింగ్‌ కు వెళ్లాలని అనుకున్నాడట.

గత ఏడాది నుండి గాయం కారణంగా క్రికెట్‌ కు దూరంగా ఉంటున్న సురేష్‌ రైనా ఐపీఎల్‌ తో మళ్లీ తన సత్తా చాటి జాతీయ టీంలో చోటు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్రష్‌ గురించి చెప్పుకొచ్చాడు. అప్పట్లో సోనాలీ బింద్రె అంటే చాలా ఇష్టం. ఆమెతో డేటింగ్‌ కు వెళ్లాలని కూడా చాలా ఆరాటపడ్డాను. కాని కుదరలేదు అన్నాడు. కాని ఒకానొక సమయంలో ఆమె నుండి ఒక మంచి మెసేజ్‌ నాకు వచ్చింది. ఆ మెసేజ్‌ నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని సురేష్‌ రైనా పేర్కొన్నాడు.


Tags:    

Similar News