మంచు ఇంట్లో సీక్రెట్ స్టార్ మీటింగ్

Update: 2019-09-25 06:35 GMT
రంగుల ప్రపంచం విచిత్ర‌మైన‌ది. ఎవ‌రిని ఎప్పుడు పైకి ఎత్తేస్తుందో ఎప్పుడు కిందికి దించేస్తుందో తెలీదు. ఆ కోవ‌లో చూస్తే గ‌జిని సూర్య కెరీర్ ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో డౌన్ ట్రెండ్ లో న‌డుస్తోంద‌న్నది అంద‌రికీ అర్థ‌మైంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డేస్తుంద‌ని ఆశించిన `బందోబ‌స్త్` కూడా తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సూర్య పుంజుకునే మార్గ‌మే లేదా? అంటూ అభిమానులు నిరాశ చెందారు.

అయితే అత‌డికి ఇంకో ఆశ కూడా ఉంది. ప్ర‌స్తుతం మంచు కాంపౌండ్ హీరోతో క‌లిసి ద్విభాషా చిత్రంలో న‌టిస్తున్నారు సూర్య‌. `సైరారై పొట్రు` అనేది త‌మిళ వెర్ష‌న్ టైటిల్. `గురు` ఫేం సుధ కొంగ‌ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మంచు మోహ‌న్ బాబు ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జెట్ స్పీడ్ తో పూర్త‌వుతోంది.

ఇటీవ‌లే సూర్య శంషాబాద్ విమానాశ్ర‌యంలో దిగి వెళుతున్నప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అయితే సూర్య ఎక్క‌డికి వెళ్లారు? అంటూ ఫ్యాన్స్ ఆరాలు తీశారు. ఆ స‌మ‌యంలో శంషాబాద్ కి కూత‌వేటు దూరంలోనే ఉన్న మంచు మోహ‌న్ బాబు ఇంటికి వెళ్లార‌ని తెలిసింది. సూర్య‌ను మంచు వార‌సుడు విష్ణు స్వ‌యంగా రిసీవ్ చేసుకుని అతిధి మ‌ర్యాద‌లు చేశార‌ట‌. దీంతో మంచు ఇంట్లో సీక్రెట్ స్టార్ ఎవ‌రు? అంటూ మాట్లాడుకున్న‌ అభిమానుల‌కు స‌మాధానం దొరికిన‌ట్ట‌య్యింది. ఇక ఈ ద్విభాషా చిత్రం కం మ‌ల్టీస్టార‌ర్ తో సూర్య‌కు విజ‌యం ద‌క్క‌నుందా.. అత‌డు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి కంబ్యాక్ అవుతాడా? అన్న‌ది చూడాలి. ఇంకా ఈ సినిమాకి తెలుగు వెర్ష‌న్ టైటిల్ ని ప్ర‌క‌టించాల్సి ఉంది.


Tags:    

Similar News