ప్రయోగాలు చేయడానికి తమిళ హీరో సూర్య ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాడు. ఇప్పటికే కెరీర్ లో ఎన్నో విలక్షణమైన సినిమాల్లో నటించాడు. సుధ కొంగర దర్శకత్వం వహించిన `సూరరై పొట్రు` బయోపిక్ కథాంశంతో తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అటుపైనా సూర్య లైనప్ చూస్తే ఆసక్తిని పెంచుతోంది.
వేట్రి మారన్ దర్శకత్వంలో `వాడివాసల్`.. సింగం హరి దర్శకత్వంలో `అరువా` చిత్రీకరణలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సూర్య ఓ గ్రామీణ నేపథ్యంలో థ్రిల్లర్ లో నటించనున్నారు. కరోనావైరస్ మహమ్మారి లాక్ డౌన్ వల్ల వెట్రిమారన్ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. అతడితో సినిమాని త్వరగా పూర్తి చేసే ఆలోచనలో సూర్య ఉన్నారు. జీవీపీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.
వేట్రి మారన్ ఎంపిక చేసుకున్న కథాంశం ఆసక్తికరం. దక్షిణ వాడివాసల్ అనేది దక్షిణ తమిళనాడులో ప్రబలంగా ఉన్న బుల్ ఫైట్ సంస్కృతి జల్లికట్టు ఆధారంగా తెరకెక్కనుంది. కథాంశంలో ఓ ఆసక్తికరమైన ట్విస్టు ఉందిట. తన తండ్రి ప్రాణాలు తీసిన ఒక ఎద్దును మచ్చిక చేసుకునే కొడుకు గా సూర్య కనిపిస్తారు. ఇందులో తండ్రి కొడుకుగా సూర్య నటిస్తారట. సూర్య ద్విపాత్రలు పోషించే అవకాశం ఉండగా.. శరత్ కుమార్ - రాజ్‌కిరణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం 2021 ప్రారంభంలో సెట్స్ కెళ్లనుందని తెలుస్తోంది.