అనుమానాలు రేకెత్తిస్తున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌

Update: 2019-06-01 12:44 GMT
పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ త్వరలో రెండవ వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. దాదాపు ఏడాది క్రితమే రెండవ పెళ్లి కోసం నిశ్చితార్థం కూడా చేసుకుంది. పెళ్లి కూడా త్వరలో అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక కవిత సినీ వర్గాల్లో మరియు పవన్‌ ఫ్యాన్స్‌ లో చర్చనీయాంశం అయ్యింది. ఆ కవిత రేణు దేశాయ్‌ గతాన్ని గుర్తు చేసుకుని రాసిందని కొందరు.. పవన్‌ పై ఉన్న ప్రేమతో రాసిందని మరి కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇంతకు ఆ కవితలో ఏముందంటే.. ప్రేమను మళ్లీ నేర్చుకోవడం సాద్యమేనా... ? మొదటి సారి ప్రేమలో పడ్డప్పుడు వచ్చిన నవ్వు ఇప్పుడు వస్తుందా..? ఒకసారి అద్దంలో మొహం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏంటో మీకే అర్థం అవుతుంది. నిద్ర లేని రాత్రులు గడిపే వారికి వారి ప్రేమ గురించి తెలుస్తుందంటూ తన కవితలో పేర్కొంది.

రేణు దేశాయ్‌ గతంలో కూడా చాలా కవితలు పోస్ట్‌ చేసింది. కాని ఇలాంటి కవిత మాత్రం ఆమె ఎప్పుడు పోస్ట్‌ చేయలేదని.. ఆమె కవితలోనే ఏదో అనుమానం వ్యక్తం అవుతుందంటూ మెగా ఫ్యాన్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పెళ్లి పెట్టుకుని ఇలా కవితల రూపంలో పోస్ట్‌ పెట్టడం ఏంటీ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్‌ కు రేణు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. 
Tags:    

Similar News