సెన్సేష‌న‌ల్ క‌వ‌ర్ గాళ్‌

Update: 2019-01-02 15:34 GMT
త‌ను వెడ్స్ మ‌ను - రాంజానా చిత్రాల‌తో ఫిలింఫేర్‌ లు అందుకున్న బ్యూటీ స్వ‌రా భాస్క‌ర్. బాలీవుడ్ లో బెస్ట్ స‌పోర్టింగ్ న‌టిగా ఎన్నో భారీ చిత్రాల్లో న‌టించింది. స‌హాయ‌క పాత్రధారి అంటే ఇలా ఉండాలి! అనేంత గొప్ప పాత్ర‌ల్లో న‌టించింది స్వ‌రా. ఇటీవ‌లే సోన‌మ్ తో క‌లిసి `వీరే ది వెడ్డింగ్` చిత్రంలోనూ న‌టించింది. ఈ చిత్రంలో మాస్ట‌ర్‌ బేష‌న్ రోల్ తో అంద‌రికీ పెద్ద షాకిచ్చింది. న‌టించిన ప‌ది సినిమాల్లో ప్ర‌తిదీ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌నే. బాలీవుడ్ లో బెస్ట్ గ్రాసర్‌ గా నిలిచిన `ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో` చిత్రంలో స్వ‌రా ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌తో ర‌క్తి క‌ట్టించింది. అందుకే స్వ‌రాకి పిచ్చి ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

తాజాగా ఈ భామ ప్ర‌ఖ్యాత ఎఫ్ హెచ్ ఎం మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కి ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. స్వరాలోని గ్లామ‌ర్‌ యాంగిల్‌ ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటోషూట్ కుర్రకారులో వేడి పెంచుతోంది. స్వ‌ర అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో.. ఆ ప‌చ్చ‌బొట్టుపైనా యూత్ కాన్‌ స‌న్‌ ట్రేష‌న్ షురూ అయిన‌ట్టే.

కొత్త సంవ‌త్స‌రంలో కొత్త గోల్స్ ని ఫిక్స్ చేసుకున్న ఈ బ్యూటీ మునుముందు సౌత్ లోనూ ఆరంగేట్రం చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉందిట‌. ఓవైపు హిందీ సినిమాలు చేస్తూనే - ఇత‌ర భాష‌ల్లోనూ కెరీర్ ని విస్త‌రించే పనిలో ఉందిట‌. స్వ‌రా ట్యాలెంటెడ్ కాబ‌ట్టి - అవ‌కాశం ఇచ్చేందుకు యువ‌త‌రం ద‌ర్శ‌కులు అటువైపు దృష్టి సారిస్తారేమో?



Tags:    

Similar News