బాక్సర్ కి సాయం చేస్తున్న తాప్సీ

Update: 2016-05-18 05:41 GMT
ఒలింపిక్స్ కి ఎంపికవడమే ఓ కలను సాకారం చేసుకోవడం. అలాంటిది ఒలింపిక్స్ కు ఆర్థిక ఇబ్బందులతో దూరమయ్యే పరిస్థితి.. ఎవరినైనా కదిలిస్తుంది. హైద్రాబాదీ బాక్సర్ లిఖిత ఎదుర్కుంటున్న ఈ పరిస్థితిని తెలుసుకున్న తాప్సీ.. తక్షణమే రంగంలోకి దిగిపోయింది. ఓ స్నేహితురాలి ద్వారా లిఖిత ఇబ్బందుల గురించి తెలియడంతో.. ఆమెకు సాయం చేసేందుకు.. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను.

'ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యేందుకు తగిన ట్రైనింగ్ - ఇతర సరంజామా కోసం లిఖిత స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది. నిధులు సమీకరిస్తే మినహా.. స్వయంగా వాటిని సమకూర్చుకోగలిగే  అవకాశం లేదు. ఈమె పడుతున్న ఇబ్బందుల గురించి తెలిసిన తాప్సీ.. ఓ ఎన్టీఓ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించింది. ఇప్పటికే లిఖిత కోసం పెద్ద మొత్తాన్నే తాప్సీ కలెక్ట్ చేసింది. ఆమెకు కావాల్సిన ప్రతీ వస్తువును లిస్ట్ చేసి, ఆ ఎక్విప్మెంట్ తో పాటు ప్రయాణ ఏర్పాట్లను కూడా పరిశీలించడం విశేషం.' అంటున్నారు సన్నిహితులు.

ఓ ఇబ్బంది గురించి తెలిస్తే.. డబ్బులిచ్చి సరిపెట్టుకోవడం కాకుండా.. దగ్గరుండి ఏర్పాట్లు చేయడంలోనే తాప్సీ కమిట్మెంట్ అర్ధమవుతుంది.
Tags:    

Similar News