నాన్న హీరోయిన్‌తో.. కొడుకు లవర్‌తో..

Update: 2015-04-13 09:30 GMT
కింగ్‌ నాగార్జున ఏం చేసినా అందులో సంథింగ్‌ ఉంటుంది. ఏ పనిచేసినా యునిక్‌. అందుకే అతడి నుంచి శివ, గీతాంజలి, హలోబ్రదర్‌, జానకిరాముడు, మనం లాంటి క్లాసిక్‌ హిట్స్‌ వచ్చాయి. బుల్లి తెరపై ఇప్పటికీ ఇవన్నీ ఎవర్‌గ్రీన్‌ సినిమాలుగా రాజ్యమేలుతున్నాయి. అంతేకాదు నాగార్జున నటించిన శివ అప్పట్లోనే విలక్షణమైన సినిమా. ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఇప్పుడు ఆ సినిమా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సరికొత్త హంగులు అద్దుకుని మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

కింగ్‌ నాగార్జున సినిమాల విషయంలోనే కాదు ఎన్నో విషయాల్లో ప్రయాగాలు చేసిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కథానాయికల విషయంలోనూ ఆయన ప్రయోగం చేసి హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. అతడు తండ్రి హీరోయిన్‌తో, కొడుకు హీరోయిన్‌తో రొమాన్స్‌ చేయడం టాలీవడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అప్పట్లో ఏఎన్నార్‌ సరసన కథానాయికగా నటించిన శ్రీదేవి .. ఆఖరి పోరాటం సినిమాలో నాగార్జున సరసన నటించారు. అలాగే నాగచైతన్య సరసన ఇప్పటికే రెండు సినిమాల్లో నాయికగా నటించింది తమన్నా. ఇప్పుడు ఈ భామ నాగార్జున నటిస్తున్న మల్టీస్టారర్‌లో నాయిక అయ్యింది. తమన్నా నాగార్జునకు పెయిర్‌ అవుతుందా? లేక కార్తీకి పెయిర్‌గా నటిస్తుందా? అన్నది ఇంకా బైటికి తెలీదు. ఒకవేళ నాగార్జున సరసన తమన్నా నటిస్తోంది అంటే ఆ ఫీట్‌ ఎక్స్‌క్లూజివ్‌. అంటే ఇలాంటి యునిక్‌ ఫీచర్స్‌ కింగ్‌కి మాత్రమే సాధ్యం అని ఒప్పుకోవాల్సిందే.
Tags:    

Similar News