తాప్సీ@10... వాళ్లు కూడా నోరు వెళ్లబెడుతున్నారు

Update: 2022-07-29 02:30 GMT
తెలుగు లో మంచు మనోజ్‌ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ అమ్మడు తెలుగు లో భారీ కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌ లు ఏమీ దక్కించుకోలేదు. కాని పెద్ద హీరోలతో వరుసగా నటించే అవకాశాలను మాత్రం దక్కించుకుంది. హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్‌ లో వరుస సినిమా ల్లో నటించింది.

తాప్సి తెలుగు సినిమాల్లో మెజార్టీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ఆఫర్లు మాత్రం తగ్గలేదు. తెలుగు లో వరుసగా ఆఫర్లు వస్తూ బిజీగా ఉన్న సమయంలో తమిళం మరియు హిందీ సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేసింది. హిందీలో తాప్సికి అనూహ్యంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమా ల యొక్క హీరోయిన్ గా ముద్ర పడింది.

కొన్ని కమర్షియల్‌ సినిమాల్లో నటించినా కూడా అవి పెద్దగా ఆడలేదు. దాంతో ఈమె పూర్తిగా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో అయితే సినిమా ల్లో అయితే బాగుంటుందని మేకర్స్‌ భావించారు. అందుకే ఈమె కు వరుసగా అలాంటి సినిమా ల్లోనే అవకాశాలు ఇస్తూ ఆమె తో సినిమా లను చేసేందుకు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు.

తాప్సి తాజాగా శభాష్‌ మిథు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. క్రికెట్‌ నేపథ్యం లో రూపొందిన ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. అయినా కూడా ఆమె సినిమా ల జాతర మాత్రం కంటిన్యూ అవుతోంది.

ఈ ఏడాది లో ఆమె నుండి విడుదల అయిన.. విడుదల కాబోతున్న సినిమా లు పది. ఈ సంఖ్య మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదు. కమర్షియల్‌ హిట్‌ లేకున్నా కూడా ఈ అమ్మడికి వస్తున్న ఆఫర్లను చూసి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకుంటూ నోరు వెళ్లబెడుతున్నారట.

హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్‌ లో ఎలా అయితే లక్ తో తన అందంతో కెరీర్‌ ను నెట్టుకు వచ్చిందో ఇప్పుడు అలాగే బాలీవుడ్‌ లో కూడా సక్సెస్ లేకుండానే కెరీర్‌ ను నెట్టుకు పోతుంది. హీరోయిన్ గా తాప్సి తెలుగు లో కూడా ఒకటి రెండు సినిమా ల్లో నటించేందుకు సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News