దశాబ్దంన్నర నుంచి ట్రై చేస్తున్నాడు తారకరత్న.. టాలీవుడ్లో నిలదొక్కుకుందామని. కానీ ఇప్పటిదాకా అతడికి ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. హీరో వేషాలు వదిలేసి నెగెటివ్ రోల్స్ చేస్తున్నా అతడికి సరైన ఫలితం దక్కలేదు. ‘అమరావతి’లో విలన్ పాత్ర నంది అవార్డైతే తెచ్చిపెట్టింది కానీ.. సక్సెస్ మాత్రం ఇవ్వలేదు. పోయినేడాది ‘రాజా చెయ్యి వేస్తే’ అయినా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందేమో అని ఆశిస్తే అదీ నిరాశనే మిగిల్చింది. దాని తర్వాత తారకరత్న మరోసారి ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. చాలా కాలంగా విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఐతే ఈ రాజా వేసిన కేక జనాలకు అసలేమాత్రం వినిపించినట్లు లేదు. చాలా తక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయగా.. అక్కడ కూడా స్పందన లేదు. సినిమా టాక్ గురించి కూడా చర్చ లేదు. సినిమా బాగా లేదన్నది చూసిన వాళ్ల ఫీడ్ బ్యాక్. సత్యం రామలింగ రాజు కుంభకోణం నేపథ్యంలో మంచి కాన్సెప్టే ఎంచుకున్నప్పటికీ.. దాన్ని దర్శకుడు సరిగా హ్యాండిల్ చేయలేదంటున్నారు. తారకరత్న పెర్ఫామెన్స్ బాగానే ఉన్నట్లు ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ చిత్ర కథానాయకుడు రేవంత్ కు కూడా ఇది కీలకమైన సినిమా. తొలి సినిమా ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదలకే నోచుకోకపోవడంతో ఈ సినిమా కాస్త ఆడితే.. దాన్ని బయటికి తేవొచ్చని ఆశించాడు రేవంత్. కానీ అతడి ఆశ నెరవేరేలా లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/