తనకూ సరైన టైం వస్తుందని.. అప్పుడు తానూ సినిమాల్లో నిలదొక్కుకుంటానని అంటున్నాడు నందమూరి తారకరత్న. దశాబ్దంన్నర నుంచి హీరోగా హిట్టు కోసం పోరాడుతున్న తారకరత్న ఇప్పుడు విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ గురించి అతను స్పందిస్తూ.. ‘‘లైఫ్ స్పీడ్ బ్రేకర్ లాంటిది అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. నేను టైంనే నమ్ముతాను. ఎప్పటికైనా నాకు మంచి టైమ్ వస్తుందనుకుంటున్నా. ఆ నమ్మకం లేకపోతే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. అందుచేత నాకూ టైం వస్తుందనే నమ్మకం ఉంది కానీ.. కెరీర్ విషయంలో అసంతృప్తి లేదు’’ అని అన్నాడు.
రాజా చెయ్యి వేస్తేలో తాను పోషించిన విలన్ పాత్ర గురించి చెబుతూ.. ‘‘ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. దేనికి భయపడని మొండోడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది. ఇప్పటి వరకు విలన్ అంటే..కామెడీ విలన్ని చూసుంటారు. తనకు అడ్డువచ్చిన వాళ్లని చంపేసే విలన్ని చూసుంటారు. కానీ ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో మంచి చెడు ఉంటుంది. అలాగే ఈ క్యారెక్టర్ లో కూడా మంచి చెడు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే..విలన్ని కూడా ఆడియోన్స్ మెచ్చుకునేలా ఉంటుంది’’ అని తారకరత్న చెప్పాడు. తనకు పాత్ర నచ్చితే ఇకముందూ విలన్ పాత్ర చేయడానికి రెడీ అని.. అలాగే హీరో పాత్రల్లో కూడా కంటిన్యూ అవుతానని తారకరత్న చెప్పాడు.