కరోనా కల్లోలంలో రిలీజై చాలా చోట్ల చక్కని వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా టెనెట్. పరిమితుల నడుమ థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేసినా విమర్శకుల ప్రశంసలతో ఈ సినిమాని వీక్షించేందుకు జనం సాహసం చేశారు. అయితే కరోనా భయాల నడుమ ఆశించినంత పెద్ద రేంజు లో బాక్సాఫీస్ రిజల్ట్ ని అందుకోవడం కుదరలేదు.
ఆస్కార్ గ్రహీత క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ఈ సినిమా కథాంశం ఎంతో ఎగ్జయిట్ చేసిందన్న ప్రశంసలు దక్కాయి. థియేట్రికల్ రన్ తరువాత ఈ చిత్రం ఇప్పుడు ఆన్ లైన్ లో ప్రసారం అవుతోంది.
థియేటర్లలో తక్కువ ఆక్యుపెన్సీ నిబంధనలు ఉన్నప్పుడు ఈ అధిక-బడ్జెట్ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ధైర్యం చేశారు. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. నోలాన్ స్టార్ డమ్.. ఆద్యంతం ఉత్కంఠ రేపే సినిమా విలక్షణ కథాంశం టెనెట్ విజయానికి సహాయపడ్డాయి. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. టెనెట్ డిసెంబర్ 4 న భారతదేశంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. దీనికి భారతీయ ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. పెద్ద తెరపై ఈ గొప్ప విజువల్ వండర్ ని వీక్షించడం కుదరని వారంతా ఇప్పుడు దాన్ని ప్రైమ్ వీడియోలో చూసే వీలు కలుగుతోంది.
ఆసక్తికరంగా ఈ చిత్రం తెలుగు- హిందీ- తమిళ భాషలలో కూడా ప్రసారం అవుతోంది. టెనెట్ ను థియేటర్లలో చూడలేని వారంతా చూసే వీలుంది. జార్జ్ డేవిడ్ వాషింగ్టన్- రాబర్ట్ ప్యాటిన్సన్- ఎలిజబెత్ డెబికి - డింపుల్ కపాడియా ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో టెనెట్ ఆస్కార్ అవార్డుల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.