రామ్ చరణ్ తో బోయపాటి తెరకెక్కించిన హై ఓల్టేజ్ మాస్ మసాలా, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ‘వినయ విధేయ రామ’. బోయపాటి మూవీలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ సినిమాలకే ఓవర్సీస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే విషయం ఈమద్య కాలంగా చాలా సార్లు నిరూపితం అయ్యింది. స్టార్ హీరోలు మినిమం పది కోట్ల మార్క్ ను టచ్ చేస్తున్న ఈ నేపథ్యంలో వినయ విధేయ రామ చిత్రం ఓవర్సీస్ లో ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో అంటూ సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఓవర్సీస్ లో వినయ విధేయ రామ చిత్రం 9 కోట్ల బిజినెస్ ను చేసినట్లుగా సమాచారం అందుతోంది. వినయ విధేయ రామ చిత్రం పూర్తి మాస్ మసాలా చిత్రం అవ్వడంతో అక్కడ వసూళ్ల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ చిత్రంకు ఇప్పటికే ఫ్యామిలీ చిత్రాలుగా గుర్తింపు దక్కించుకున్న ‘ఎఫ్ 2’ మరియు ‘ఎన్టీఆర్’ చిత్రాలు గట్టి పోటీని ఇవ్వబోతున్నాయి. రికార్డు స్థాయిలో వసూళ్ల నమోదు అయితే అసాధ్యం అంటున్నారు.
‘వినయ విధేయ రామ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టగలదని ట్రేడ్ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడం చాలా కష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి ఇప్పటి వరకు ఓవర్సీస్ లో పెద్దగా వసూళ్లు సాధించిన దాఖలాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లోనే బోయపాటి ఇప్పటి వరకు సందడి చేశాడు. కాని ఓవర్సీస్ లో మాత్రం బోయపాటి ఇప్పటి వరకు టాప్ జాబితాలో చేరలేక పోయాడు. ఈసారి బోయపాటి అక్కడ సత్తా చాటాలని ఈ చిత్రానికి ఫ్యామిలీ టచ్ ఇచ్చాడు. మరి ఈ చిత్రంతో అయినా బోయపాటికి అక్కడ మంచి ఓపెనింగ్స్, కలెక్షన్స్ వస్తాయా అనేది చూడాలి.