కొన్ని కథల ముగింపు ముందే నిర్ణయించబడుతుంది

Update: 2022-02-05 17:30 GMT
అమెజాన్ ప్రైమ్‌ ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ బెస్ట్‌ సెల్లర్‌ ఈనెల 18న స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దం అయ్యింది. సైలెంట్ గా ఈ వెబ్‌ సిరీస్ యొక్క షూటింగ్‌ ను ముగించారు. బాలీవుడ్‌ స్టార్‌ మిథున్ చక్రవర్తితో పాటు శృతి హాసన్‌.. దీపక్‌.. సత్యజీత్‌.. సోనాలి ఇంకా ప్రముఖులు నటించిన ఈ వెబ్‌ సిరీస్ టీజర్ ను తాజాగా అమెజాన్ విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ పై ఉన్న అంచనాలను మరింతగా పెంచే విధంగా ఈ టీజర్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్‌ సెల్లర్ టీజర్‌ వాయిస్ ఓవర్ తో కొనసాగింది. చాలా పవర్ ఫుల్‌ ఆ వాయిస్‌ ఓవర్‌ లో కొన్ని కథలకు ముందే ముగింపు ఉంటుందని చెప్పడంతో ఈ వెబ్‌ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌ గా.. థ్రిల్లర్ గా సాగబోతుంది అనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ బెస్ట్‌ సెల్లర్‌ వెబ్‌ సిరీస్ ను ప్రముఖ రచయిత రవి సుబ్రహ్మణియన్‌ రచించిన నవల బెస్ట్‌ సెల్లర్ నుండి తెరకెక్కించడం జరిగింది. ఆ నవల కు కాస్త కమర్షియల్‌ టచ్ ఇచ్చి స్క్రీన్‌ ప్లేను నడిపించబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శృతి హాసన్‌ మొదటి సారి వెబ్‌ సిరీస్ లో నటించడం వల్ల ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సౌత్ లో కూడా శృతి హాసన్ కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. కనుక హిందీలో బెస్ట్ సెల్లర్ మంచి సక్సెస్ ను దక్కించుకుంటే ఖచ్చితంగా సౌత్‌ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఓటీటీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శృతి హాసన్‌ ప్రస్తుతం తెలుగు లో రెండు సినిమా లను చేస్తోంది. అందులో మొదటిది ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా కాగా రెండవది బాలయ్య హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. ఈ రెండు సినిమా లు మాత్రమే కాకుండా ఇక మీదట బ్యాక్ టు బ్యాక్ వెబ్‌ సిరీస్ లు చేసేందుకు ఆమె సిద్దంగా ఉంది. సాదారనంగా వెబ్‌ సిరీస్ లు అంటే హీరోయిన్స్ అందల ప్రదర్శణ ఉంటుంది. కాని ఈ వెబ్‌ సిరీస్ లో ఒక సాదారణ లేడీ జర్నలిస్ట్‌ గా శృతి హాసన్ సింపుల్‌ లుక్ లో కనిపించబోతుందని పోస్టర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది. హీరోయిన్ గా ఇప్పటికే సినిమాల ద్వారా గుర్తింపు దక్కించుకున్న శృతి హాసన్ నటిగా ఈ వెబ్ సిరీస్ తో మరింత గా పేరు దక్కించుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News