టాలీవుడ్ లలో ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టిన మహి వి.రాఘవ్.. ఆ తర్వాత డైరెక్టర్ అవతారమెత్తారు. 'విలేజ్ లో వినాయకుడు' 'కుదిరితే కప్పు కాఫీ' వంటి సినిమాలను నిర్మించిన మహి.. 'పాఠశాల' అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత 'ఆనందో బ్రహ్మ' అనే హారర్ కామెడీని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని 'యాత్ర' అనే సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా తర్వాత మహి రాఘవ్ రూపొందించే ప్రాజెక్ట్ గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.
'యాత్ర' సినిమా విడుదలై ప్రశంసలు దక్కించుకుంటున్న సమయంలోనే 'యాత్ర 2' తీస్తానని మహి ప్రకటించారు. ప్రస్తుత ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ నటించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ అయితే జగన్ పాత్రకు సరిపోతారని దర్శకుడు భావించారని అన్నారు. అయితే 'యాత్ర 2' లో ఇంకా హీరోని డిసైడ్ చేయలేదని తాజాగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి వైఎస్ జగన్ బియోపిక్ గా 'యాత్ర 2' సినిమా చేయాలనే ఆలోచనతో మహి వి.రాఘవ్ ఉన్నప్పటికీ.. ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాల్సి ఉందట. అందుకే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి చాలా సమయమే పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మహి.. యూవీ క్రియేషన్స్ టీమ్ తో కలిసి పని చేస్తున్నాడని తెలుస్తోంది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో యూవీ బ్యానర్ లో ఓ సెటైరికల్ మూవీ రూపొందిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇకపోతే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కోసం మహి రాఘవ్.. ఓ వెబ్ సిరీస్ రూపొందించనున్నారట. ఇదే క్రమంలో 'యాత్ర' సీక్వెల్ ఉండే అవకాశం ఉంది.
'యాత్ర 2' చిత్రంలో వైఎస్సార్ మరణం నుంచి.. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రతో విజయం సాధించి సీఎం అయ్యేవరకు జరిగిన పరిణామాలను చూపించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ పై కేసులు పెట్టి జైలుకు పంపించడం.. సొంతంగా పార్టీ పెట్టి పోరాడిన వైనం.. ఏపీ ముఖ్యమంత్రి అవడం వంటి అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారని టాక్. మరి ఇందులో జగన్ కు దగ్గర పోలికలు ఉండే ప్రతీక్ గాంధీ ని లీడ్ రోల్ లో తీసుకుంటారేమో చూడాలి.