ఫేక్ పిక్ అది.. గుట్టు అలా లీక్!

Update: 2019-05-17 10:12 GMT
రాకింగ్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్-1` సంచ‌ల‌నాల గురించి ఇంకా ముచ్చ‌ట సాగుతూనే ఉంది. బంగారు గ‌నుల మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా ఇది. ఈ సినిమా బాక్సాఫీస్ స‌క్సెస్ య‌శ్ అండ్ టీమ్ లో ఉత్సాహంతో పాటు ఎన‌ర్జీని నింపింది. అదే ఎన‌ర్జీతో ప్ర‌స్తుతం కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా హోంబ‌లే ఫిలింస్ ప‌తాకంపై తెర‌కెక్కుతోంది.  ఇప్ప‌టికే ఆన్ లొకేష‌న్ ఫోటోలు అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అయ్యాయి.

ఇటీవ‌లే య‌శ్ ర‌గ్గ్ డ్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలంలో రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఇదే చాప్ట‌ర్ 2లో య‌శ్ కొత్త‌ లుక్ అంటూ ప్ర‌చారం హోరెత్తింది. ఈ ఫోటోని అభిమానులు జోరుగా వైర‌ల్ చేశారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం... ఆ ఫోటోలో ఉన్న‌ది య‌శ్ కాద‌ని తెలుస్తోంది. దీప‌క్ శ‌ర్మ అనే ఓ అప్ కం మోడ‌ల్ ఇలా య‌శ్ త‌ర‌హాలో లాంగ్ హెయిర్ పెంచి.. య‌శ్ ని ఇమ్మిటేట్ చేస్తూ సెల్ఫీ దిగాడు. ఈ ఫోటో ని ఆన్ లైన్ లో లీక్ చేశాడు. దానినే ఒరిజిన‌ల్ లుక్ అని భ్ర‌మ‌ప‌డ్డ సామాజిక జ‌నం షేర్ లు.. లైక్ ల‌తో హోరెత్తించారు. ఇది ఫేక్ అని చెప్పేందుకు దీపక్ శ‌ర్మ త‌న ఒరిజిన‌ల్ గెట‌ప్ ని ఆ ఫోటోతో ఎటాచ్ చేసి పంపించాడు. అయితే ఇలా ఒరిజిన‌ల్ అన్న పేరుతో ఫేక్ ప్ర‌చారం చేసేవాళ్ల‌పై హోంబ‌లే ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ సీరియ‌స్ గా స్పందిస్తుందా? అన్న‌ది చూడాలి.

య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రంలో సంజ‌య్ ద‌త్ నటిస్తార‌ని ప్ర‌చార‌మైనా ఆయ‌న నుంచి ఇంకా క‌న్ఫ‌ర్మేష‌న్ లేద‌ని తెలుస్తోంది. ర‌వీనా టాండ‌న్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. దీనిపైనా అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఇక తొలి భాగం కంటే మూడు నాలుగు రెట్లు అధిక యాక్ష‌న్ సీక్వెల్ కి ప్ర‌ధానంగా హైలైట్ అవుతుంద‌ట‌.



    
    
    

Tags:    

Similar News