తెలుగు బుల్లి తెరను సుదీర్ఘ కాలంగా షేక్ చేస్తూ వస్తున్న జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు తప్పుకున్న విషయం తెల్సిందే. నాగబాబు తప్పుకోవడంతో అంతా కూడా జబర్దస్త్ పనైపోయింది అంటూ కామెంట్స్ చేశారు. నాగబాబు వల్లే జబర్దస్త్ సాగుతుందని.. నాగబాబు లేకుంటే జబర్దస్త్ ను ఎవరు చూస్తారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. జబర్దస్త్ నుండి నాగబాబు వెళ్లి పోయి రెండు వారాలు అయ్యింది. రెండు వారాల ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి.
రోజాతో పాటు గెస్ట్ జడ్జ్ లను తీసుకు వచ్చి జబర్దస్త్ ను రన్ చేస్తున్నారు. నాగబాబు వచ్చినా రాకున్నా జబర్దస్త్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని మొన్నటి వారం రేటింగ్ ను బట్టి చూస్తే అర్థం అవుతుంది. ప్రేక్షకులు అలవాటు పడింది జబర్దస్త్ కే కాని నాగబాబుకు కాదని ఆ రేటింగ్ ను బట్టి అర్థం అవుతుంది. నాగబాబు ఉన్నప్పుడు ఎలా అయితే రేటింగ్ వచ్చిందో.. అలాగే నాగబాబు ఉన్నప్పుడు ఎలా అయితే యూట్యూబ్ లో వ్యూస్ వచ్చాయో కాస్త అటు ఇటుగా అదే విధంగా వచ్చాయి.
నాగబాబు లేక పోవడంతో మల్లెమాల వారు జబర్దస్త్ ను క్లోజ్ చేస్తారేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ఎలాంటి ఇబ్బంది లేకుండా జబర్దస్త్ కొనసాగుతోంది. ఇదే సమయంలో జీ తెలుగులో ప్రారంభం అయిన కామెడీ షో లోకల్ గ్యాంగ్స్ కు మాత్రం ఆధరణ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ప్రదీప్.. రవి.. అనసూయ ఇంకా ప్రముఖులు ఉన్నా కూడా లోకల్ గ్యాంగ్స్ ను మాత్రం జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. జబర్దస్త్ క్రేజ్ తగ్గితే అప్పుడు లోకల్ గ్యాంగ్స్ రేటింగ్ పెరిగే అవకాశం ఉందని జీ తెలుగు వారు భావించారు. కాని వారి ఆలోచన తారు మారు అయ్యింది.