యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూలీ ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. మార్చి 25న భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా విదేశీయులు సైతం ఈ చిత్రానికి జేజేలు పలుకుతున్నారు. సినిమా అద్బుతంగా వుందని వారే ప్రచార కర్తలుగా మారి ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 600 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. బాహుబలి రికార్డులని తిరగరాస్తున్న ట్రిపుల్ ఆర్ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని క్రాస్ చేస్తుందని, భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని అంటున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశం ఒకటి తాజాగా బయటికొచ్చింది.
ఈ చిత్రంలోని ప్రధాన కథ అదిలావాద్ ఫారెస్ట్ లో అంటూ మొదలవుతుంది. అక్కడ వేటకు వెళ్లిన బ్రిటీష్ గవర్నర్ స్కాట్ తన భార్య కోరిందని గిరిజన పాప మల్లిని బానిసగా తమతో ఢిల్లీ కోటకు తీసుకెళతారు.
ఈ సన్నివేశానికి ముందు స్కాట్ వైఫ్ కు గోరింటాకు పెడుతూ మల్లి అనే పాప పాడే `కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా..` పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. కథను కీలకంగా నిలిచిన మల్లి పాడిన పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేయమని సనీ ప్రియులు చిత్ర బృందాన్ని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పాటని పాడిన పాపకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. సినిమా కోసం ఈ పాటని పాడిన బాలగాయని ప్రకృతిరెడ్డి. కర్ణాటకలోని బళ్లారిలో పుట్టిన ప్రకృతిరెడ్డికి చిన్నతనం నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని గ్రహించిన తల్లిదండ్రులు ఆ పాపకు ప్రత్యేకంగా సంగీతాన్ని నేర్పించారు. ఈ క్రమంలో కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ పాటలు పాడటం నేర్చుకుంది ప్రకృతిరెడ్డి.
శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారం అయిన `అన్నమయ్య పాటకు పట్టాభిషేకం` కార్యక్రమంలో పాల్గొని మధురమైన కీర్తనలు ఆలపించి కీరవాణి దీవెనలు పొందింది. ఆ తరువాత ఎంతో మంది సింగర్స్, సంగీత దర్శకులు, గేయరచయితలు ప్రకృతిరెడ్డి పాటకు పరవశించారు. ఇదే టైమ్ లో కీరవాణి దృష్టి పాపపై పడింది. అలా `ట్రిపుల్ ఆర్`లో పాట పాడేలా చేసింది.