‘ఉప్పెన‌’ స‌క్సెస్ అప్పుడే ఊహించానుః డీఎస్పీ

Update: 2021-02-07 08:30 GMT
మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘ఉప్పెన’. క‌న్న‌డ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని.. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్ర‌మంలో శ‌నివారం హైద‌రాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈ వెంట్ నిర్వ‌హించారు. ఎన్-కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. మ్యూజిక్ సెన్సేష‌న్ దేవిశ్రీ ఈ వేడుక‌లో త‌న‌దైన జోష్ నింపారు.

ఈ సంద‌ర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... ‘ఆచార్య’ అనే టైటిల్ చిరంజీవి గారికి సరిగ్గా సరిపోతుందని అన్నారు. ‘‘చిరంజీవి గారికి ఆచార్య సరైన టైటిల్. ఎందుకంటే.. ఆయన మొత్తం ఇండియన్ సినిమాలోని ఎంతో మంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, సంగీత దర్శకులు, డ్యాన్సర్లకు ఎన్నో పాఠాలు నేర్పించారు’’ అని అన్నారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక, ఉప్పెన సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఆడియో సక్సెస్ అవుతుందని తాను ముందుగానే గుర్తించానని అన్నారు. “నేను ఈ సినిమాకు వర్క్ చేస్తూ చాలా ఆనందించాను. మొదటి రోజు బుచ్చిబాబు గారు కథ చెప్పినప్పుడే ఆడియో సక్సెస్ అవుతుందని నాకు తెలుసు.’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్.

ఈ చిత్ర దర్శకుడి కెరీర్ అద్భుతంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘దర్శకుడు బుచ్చిబాబుకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి నా శుభాకాంక్షలు. వైష్ణవ్ తేజ్ వాయిస్ అద్భుతంగా ఉంది. ఆయన డబ్బింగ్ చాలా బాగుంటుంది.’’ అన్నారు డీఎస్పీ.

సాహిత్యం అందించిన వారిని కూడా అభినందించాడు దేవీ. ‘‘ఈ చిత్రానికి అద్భుతమైన సాహిత్యం అందించిన రచయితలు శ్రీమణి గారికి, చంద్రబోస్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో శివుడిపై బోస్ గారు రాసిన పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది”అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.
Tags:    

Similar News