చిరంజీవి-సురేఖ‌ పెళ్లికి ముందు జ‌రిగిన ప్రీక్వెల్ స్టోరీ ఇది!

Update: 2022-10-12 14:12 GMT
మెగాస్టార్ చిరంజీవి-సురేఖ‌ల పెళ్లి తంతు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ జంట పెళ్లి ఎలా జ‌రిగింద‌న్న విష‌యాన్ని చిరు చాలా ఇంట‌ర్వ్యూల్లో రివీల్ చేసారు. ఆ నాటి సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకుని సురేఖ‌పై ఇప్ప‌టికీ స‌ర‌దాగా సెటైర్లు వేస్తుంటారు. పెద్దావిడ సైతం వాటిని అంతే స‌ర‌దగా తీసుకుంటారు. అయితే ఈ దంప‌తుల పెళ్లికి ముందు చాలా పెద్ద క‌థే సాగింద‌ని తెలుస్తోంది.

సినిమా వాళ్ల‌కి పిల్ల‌నివ్వ‌డం ఏంటి? అల్లు రామలింగ‌య్య ఇంట్లో సైతం డిస్క‌ష‌న్ కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ క‌థ వింటే పెళ్లికి ముందు ప్రీక్వెల్ స్టోరీలానే అనిపిస్తుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిరంజీవి బావ‌మ‌రిది...నిర్మాత అల్లు అర‌వింద్ రివీల్ చేసారు. చిరంజీవితో  మా చెల్లి పెళ్లి జ‌ర‌గ‌డానికి కార‌ణం మా అమ్మ‌గారు.  ఓసారి చిరంజీవి స‌త్య‌నారాయ‌ణ అనే మా బంధువును క‌వ‌డానికి ఇంటికి వ‌చ్చారు.

చిరంజవి త‌లుపు త‌ట్ట‌గానే మా అమ్మే తీసింది. స‌త్య‌నారాయ‌ణ ఎక్క‌డ ఉన్నార‌ని చిరంజీవి అడ‌గ‌గా పై గ‌దిలో ఉన్నార‌ని చెప్పి పంపించింది. అత‌నితో అర‌గంట మాట్లాడి..చివ‌ర్లో వెళ్లే ముందు అమ్మ‌తో వెళ్లొస్తా అని చెప్పి వెళ్లారు. ఆ త‌ర్వాత స్య‌నారాయ‌ణని మా అమ్మి పిలిచి  ఆ అబ్బాయి సినిమాలు చేస్తాడు క‌దా అని అడిగింది. మ‌న‌వాళ్లే అన్న విష‌యాన్ని వాక‌బ్ చేసింది.

అత‌ను ఔన‌న్నాడు. ఆ రాత్రే మా నాన్న గారితో ఈ అబ్బాయి బాగున్నాడు.. మంచి సినిమాలు చేస్తున్నాడు. మ‌న‌వాళ్లే అంటున్నారు. మన అమ్మాయిని ఇచ్చి  పెళ్లి చేద్దాం అని అంది. దీనికి నాన్న‌గారు ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత చిరంజీవితో క‌లిసి నాన్న `మ‌న‌వూరి పాండ‌వులు` సినిమా చేసారు. అప్పుడే చిరంజీవి గురించి నాన్న గారు అత‌నికి  తెలియ‌కుండా ఎలాంటి వాడు అన‌న్న విష‌యాలు  తెలుసుకున్నారు.

మంచి వాడు..అమ్మాయిల జోలికి వెళ్ల‌డు. ఆ త‌ర్వాత డి.విఎస్ రాజుగారిని క‌లిసి విష‌యం చెప్పి..సినిమా వాళ్ల‌కి పిల్ల‌నివ్వ‌డం ఏంటి? అన్న‌ట్లు నాన్న‌ మాట్లాడారు. దానికి ఆయ‌న సీరియ‌స్ అయ్యారు.  నువ్వు సినిమా వాడివి..నీ కుమారుడు నిర్మాత‌. ఆ అబ్బాయి మంచి వాడు. ఎలాంటి అల‌వాట్లు లేవంటున్నావ్. ఇంకెందుకు ఆలోచిస్తున్నావ్ అనే సరికి నాన్న గారి ఆలోచ‌న విధానం మారింది. అప్పుడే చిరంజీవిని ఇంటి అల్లుడిని చేసుకోవాల‌ని ఫిక్స్ అయ్యారు. అలా సురేఖ‌-చిరంజీవిల పెళ్లి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News