ఒకపక్క సుప్రీమ్ హీరో ఇంటెలిజెంట్ మరోపక్క సీనియర్ హీరో గాయత్రి మధ్య వచ్చిన వరుణ్ తేజ్ తొలిప్రేమ మీద విడుదల ముందు వరకు భారీ అంచనాలు లేవు. ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అనే ఫీలింగ్ ట్రైలర్ లోనే ఇచ్చారు కనక ఓ మోస్తరుగా ఉండొచ్చులే అనుకున్నారు కాని రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. తొలిప్రేమ టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ పెరుగుతోంది. ఇంటెలిజెంట్ నెగటివ్ టాక్ రావడం, గాయత్రి మిశ్రమ స్పందన దక్కించుకోవడం తొలిప్రేమకు బాగా కలిసి వస్తోంది. అందరికి తెలిసిన ఒక సాధారణ ప్రేమకథను ఆర్టిస్టుల సహాయంతో తన టేకింగ్ తో మెప్పించేలా తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి మీద ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. వసూళ్లు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. మొదటి రోజు కలెక్షన్లు ఫిదాను క్రాస్ చేయటమే దీనికి నిదర్శనం.
ట్రేడ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తొలిప్రేమ మొదటి రోజు 9.5 కోట్ల గ్రాస్ సాధించి వరుణ్ సినిమాల్లో కొత్త రికార్డు సెట్ చేసింది. అతని బ్లాక్ బస్టర్ ఫిదా ఫస్ట్ డే ఇచ్చిన 8.45 కోట్ల గ్రాస్ ని కోటి రూపాయల మార్జిన్ తో దాటడం విశేషమే. సినిమాల పరంగా కొద్దిగా డ్రై సీజన్ గా భావించే ఫిబ్రవరిలో విడుదలను నిర్మాతలు సాధారణంగా రిస్క్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కాని దానికి భిన్నంగా తొలిప్రేమ రికార్డు చేస్తున్న నెంబర్స్ చూస్తే వరుణ్ కు మరో సూపర్ హిట్ జేబులో పడినట్టే. ఇక కలెక్షన్లు ఏరియా వారిగా చూసుకుంటే
గ్రాస్ షేర్
(కోట్లలో) (కోట్లలో)
నైజాం 1.18 2.00
వైజాగ్ 0.45
ఈస్ట్ 0.23
వెస్ట్ 0.25
కృష్ణ 0.23
గుంటూర్ 0.38
నెల్లూరు 0.12
ఆంధ్ర 1.67 2.55
సీడెడ్ 0.33 0.55
తెలుగు రాష్ట్రాలు(మొత్తం) 3.16 5.1
యుఎస్ 1.44 3.2
రెస్ట్ 0.52 1.3
టోటల్ 5.13 9.5
ఎలా చూసుకున్నా వరుణ్ మార్కెట్ కి ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ పరిస్థితికి ఇది చాలా మంచి ఓపెనింగ్. సింపుల్ లవ్ స్టొరీని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన తీరు యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక దగ్గరలో చెప్పుకోదగ్గ భారీ సినిమాలు ఏవి లేవు కనక ఈ జోరు కొనసాగేలా ఉంది. 16న కూడా పోటీ ఉన్నప్పటికీ యూత్ ని బేస్ చేసుకున్న ప్యూర్ లవ్ స్టొరీ ఏది లేకపోవడంతో తొలిప్రేమ స్పీడ్ కి బ్రేక్ వేసే అవకాశం లేనట్టే. మరి వరుణ్ ఓవరాల్ గా ఫిదాని దాటేస్తాడా లేదా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాలి.
Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!