తొలిప్రేమ నిర్మాతల ఐడియా అదుర్స్

Update: 2018-02-09 05:38 GMT
తన ప్రేమకథతో ఇప్పటికే టాలీవుడ్ ఆడియన్స్ ను ఫిదా చేసిన వరుణ్ తేజ్.. ఇప్పుడు తొలిప్రేమ అంటే ఫిబ్రవరి 10న వచ్చేస్తున్నాడు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ లెక్క ఇప్పుడు బైటకు వచ్చింది. ఫిదాతో 50 కోట్ల షేర్ మార్క్ ను అందుకుని.. మీడియం బడ్జెట్ సినిమాలకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసి సత్తా చాటాడు నాగబాబు తనయుడు.

ఓ సినిమా అంత వసూలు చేశాక..తర్వాతి సినిమాను అంతకు మించి అమ్మడం చూస్తూనే ఉన్నాం. అయితే.. తొలిప్రేమ విషయానికి వచ్చేసరికి.. ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసేశారు నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్. తొలిప్రేమకు నిర్మాత బీవీఎస్ ఎన్  ప్రసాద్ అయినా.. ఓవరాల్ ప్రాజెక్టును దిల్ రాజు తీసుకుని.. మొత్తం అన్ని ఏరియాల్లో సొంతగా రిలీజ్ చేసుకుంటున్నారు. తొలిప్రేమ థియేట్రికల్ రైట్స్ లెక్క ఇలా ఉంది.

నైజాం 6 కోట్లు..
 వైజాగ్ 2.5 కోట్లు..
ఈస్ట్ 1.6 కోట్లు..
వెస్ట్ 1.4 కోట్లు..
కృష్ణా 1.6 కోట్లు..
గుంటూరు 2 కోట్లు..
నెల్లూరు 0.9 కోట్లు..
సీడెడ్ 3 కోట్లు..
ఏపీ ప్లస్ నైజాం 19 కోట్లు..
కర్నాటక 0.8 కోట్లు..
రెస్టాఫ్ ఇండియా 20 లక్షలు..
ఓవర్సీస్ 3 కోట్లు..

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కుల లెక్క 23 కోట్లు అన్న మాట. అంటే గత సినిమా వసూళ్లలో సగం వచ్చినా.. తొలిప్రేమ సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది. ఎక్కువకు అమ్మేసి.. టార్గెట్ కోసం కష్టపడి.. మంచి వసూళ్లు వచ్చినా కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకునే బదులుగా.. అందరినీ సేఫ్ జోన్ లో ఉంచుతూ.. 23 కోట్లకే సినిమాను విక్రయించాలన్న దిల్ రాజు ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు.
Tags:    

Similar News