బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సంవత్సరంకు రెండు సినిమాల చొప్పున వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ రంజాన్ కు 'భారత్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జూన్ 5వ తారీకున సినిమా విడుదల కావడమే ఆలస్యం. అంతా సాఫీగా సవ్యంగా సాగుతున్న సమయంలో టైటిల్ వివాదం చిత్ర యూనిట్ సభ్యులను టెన్షన్ పెడుతోంది.
భారత్ అనే పదంను బిజినెస్ పరంగా వినియోగించవద్దంటూ సెక్షన్ 3లో ఉందని విపిన్ త్యాగీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ హైకోర్టు ప్రస్తుతం ఈ పిటీషన్ పై వాదనలు వింటోంది. విడుదలకు ముందు ఇలాంటి టైటిల్ వివాదంను ఊహించని చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రంలో పలు వివాదాస్పద డైలాగ్స్ కూడా ఉన్నాయంటూ విపిన్ త్యాగీ కోర్టుకు తెలియజేశాడు.
విపిన్ త్యాగీ వాదనలు విని కోర్టు సినిమా విడుదలకు స్టే ఇస్తే పరిస్థితి ఏంటా అంటూ నిర్మాతలు మరియు బయ్యర్లు ఆందోళనలో ఉన్నారు. మరి కోర్టు ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సల్మాన్ రెండు విభిన్నమైన పాత్రల్లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. రెండు తరాలకు చెందిన పాత్రలో సల్మాన్ కనిపిస్తాడు. ఇక సల్మాన్ కు జోడీగా ఒక తరంలో కత్రీనా కైఫ్ నటించగా మరో తరం పాత్రకు గాను దిశా పటాని హీరోయిన్ గా నటించింది.