వాళ్ల వైఫ్‌ ఫ్రెండ్స్‌ కూడా చూడలేదట

Update: 2016-03-12 22:30 GMT
ఈ మధ్యన ఒక తెలుగు సినిమా రిలీజైందిలే. ఈ సినిమాలో ఒక టాప్‌ సినీ ఫ్యామిలీకి చెందిన హీరో లీడ్‌ గా నటించాడు. చాలా యాక్టింగ్‌ టాలెంట్‌ ఉండి కూడా సరైన హిట్లు కొట్టలేకపోతున్న ఒక భామ హీరోయిన్‌ గా చేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్‌ మీద ఓవర్‌ కాన్ఫిడెన్సుతో అస్సలు సినిమాను ప్రమోట్‌ చేస్తే ఒట్టు.

సర్లేండి.. సినిమాలన్నాక హిట్టవ్వడం ఫట్టవ్వడం అందరికీ కామనే.. మరీ ముఖ్యంగా ఈ ఫ్యామిలీ హీరోలకు పిచ్చ కామనాయే. అయితే ఈ సినిమను ఈసారి ప్రతిష్ఠాత్మకంగా అమెరికాలో కూడా కాస్త భారీ ఎత్తునే రిలీజ్‌ చేశారు. అన్ని ధియేటర్ల సంగతేమోకాని.. కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ హీరోగారి వైఫ్‌ అమెరికాలో చాలా కాలం ఉండటంతో అక్కడ ఆమెకు విపరీతమైన సర్కిల్‌ ఉంది. అయితే ఆ సర్కిల్‌ లో ఉన్న వారంతా సినిమా చూస్తారని అనుకుంటే.. ఆదాయం మిలియన్లలో ఉన్న వారు కూడా.. ఆన్‌ లైన్‌ లో రివ్యూలు చదివేసి సినిమాకు వెళ్లడం మానేశారట. ఒక పర్టికులర్ హాలులో అయితే.. ఆ రోజు రాత్రికి ఒకే ఒక్క టిక్కెట్‌ తెగిందంటే చూసుకోండి మరి.

అందుకే ఇప్పుడు మన హీరో ఫుల్లు కోపంగా ఉన్నాడట. సర్లేండి.. సినిమాయే క్లిక్కవ్వనప్పుడు ఇక ఎంతమందిని అనుకొని ఏం లాభం.
Tags:    

Similar News