మనసున్న గొప్పోళ్లు.. మన తారలు

Update: 2016-06-11 11:30 GMT
స్టార్ హీరోలుగా వెలిగిపోయే అవకాశం అందరికీ రాదు. కొందరు మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే.. ఆ స్థాయికి వెళ్లాక సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కొంత మందికి మాత్రమే ఉంటుంది. సంపాదించుకోవడం తప్ప.. మంచి చేయడం అనే థాట్ అందరికీ వచ్చేది కాదు. కానీ మన స్టార్లలో కొంత మంది మాత్రం తమకు ఇంత చేసిన సమాజానికి.. అంతో ఇంతో హెల్ప్ చేస్తున్నారు.

మహేష్ బాబు ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే హీల్-ఏ-చైల్డ్ ఫౌండేషన్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ కూడా. నాగార్జున తాను స్వయంగా అవయవదానం చేయడంతో పాటు.. ఇలా చేయాలంటూ కేంపెయిన్ కి సారధ్యం వహించాడు. నాగ్ ప్రభావంతో ఇప్పటికి 4600మంది తమ అవయవాలను దానం చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి తరపున బాలకృష్ణ సేవ చేస్తున్నారు. తండ్రి మెగాస్టార్ ని ఫాలో అవుతున్న రామ్ చరణ్ రక్తదానంపై ఓ ప్రత్యేకమైన యాప్ ను తయారు చేయించాడు. షి పోలీస్ అంటూ విమెన్ సేఫ్టీ కేంపెయిన్ కు అంబాసిడర్ గా చెర్రీ వ్యహరిస్తున్నాడు. కోలీవుడ్ హీరో సూర్య.. తను ప్రారంభించినన అగరం ఫౌండేషన్ ద్వారా సర్వీసులు అందిస్తున్నాడు.

హీరోయిన్లలో అయితే ఛారిటీ పనుల్లో సమంతకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చేయాలి. ప్రత్యూష అనే ఎన్జీఓ ద్వారా సేవలు చేస్తున్న సమంత.. పైకి కనిపించని అనేక గుప్తదానాలు చేస్తూ ఉంటుంది. టీచ్ ఎయిడ్స్ క్యాంపెయిన్ కు సపోర్ట్ చేస్తోంది శృతిహాసన్. యువతలో మార్పు కోసం తనే పాడిన ఓ పాటను కూడా రిలీజ్ చేసిందీమె. ఈ ఎపిసోడ్ లో అనుష్క కూడా వాయిస్ ఇవ్వడం విశేషం.
Tags:    

Similar News