హీరోయిన్‌ తో కాలు క‌దిపితే వెయ్యి డాల‌ర్లు

Update: 2015-12-31 06:55 GMT
2015కి టాటా చెప్పి, 2016కి వెల్‌ క‌మ్ చెప్పేందుకు వేదిక‌ల‌న్నీ రెడీ అవుతున్నాయ్‌. ఈసారి కూడా ఎప్ప‌టిలానే న్యూ ఇయ‌ర్ ప్లాన్స్ గట్టిగానే ఉన్నాయ్‌. అంబ‌రాన్నంటేలా సంబ‌రాలు చేసుకునేందుకు అంతా రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అమెరికా మొత్రం ఫుల్లు జోష్‌ లో మునిగి తేలుతోంది. అక్క‌డ మ‌న ఎన్నారైలంతా హైరానా ప‌డిపోతున్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోయిన్‌ లు అమెరికాలో సైలెంటుగా డ్యాన్సింగు షోల‌కు సంత‌కాలు చేశారు. అయితే ఈ భామ‌లంతా అబ్బే అదేం లేదు! జ‌స్ట్ ఫ్యామిలీ ట్రిప్ అంటూ మొరాయించేస్తున్నారు కానీ, ఈ ట్రిప్ వెనుక బోలెడ‌న్ని డాల‌ర్లు కుర‌వ‌బోతున్నాయ‌న్న‌ది తాజా అప్‌ డేట్‌. చాలామంది స్టార్‌ హీరోయిన్లు న్యూ ఇయర్‌ నైట్‌ కు 20 నిమిషాలు డ్యాన్స్‌ వేస్తే కోట్లు ఛార్జ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. అంత లేక‌పోయినా ఎంత ద‌క్కినా ద‌క్కుడే అనుకున్న మ‌న హీరోయిన్లంతా ఈసారి సైలెంటుగా కొన్ని  కాంట్రాక్టుల‌కు సంత‌కాలు చేశారట.

ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్‌ కేవ‌లం ఓ మెడ్లీ లో డ్యాన్సులు చేసేందుకే భారీ మొత్తాన్ని అందుకుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ భామ‌ల‌తో ఎన్నారైలు స్టెప్పులేయాలంటే 1000 డాల‌ర్లు స‌మ‌ర్పించుకోవాల‌న్న‌ది స్పెష‌ల్ టారిఫ్ ప్లాన్ అని చెబుతున్నారు. భామ‌ల‌తో స‌య్యాట‌కు రయ్‌ అంటే అంతే మ‌రి?
Tags:    

Similar News