ఫోకస్‌: ముద్దుగుమ్మల మెరుపుల్లేవు!

Update: 2015-06-30 05:10 GMT
యేడాది తిరిగేలోపు హీరోయిన్లు రెండు మూడు రౌండ్లు వేస్తుంటారు. స్టార్‌ హీరోయిన్లంతా అలా వెంట వెంటనే సినిమాలతో సందడి చేస్తే ప్రేక్షకులకు ఓ కిక్కు. థియేటర్లకు పరుగులు పెడతారు. ఈసారి మాత్రం హీరోల్లాగే హీరోయిన్లు కూడా ఒకొక్క సినిమాతో సరిపెట్టేసేలా కనిపిస్తున్నారు. గడిచిన ఆర్నెళ్లను పరిశీలిస్తే ఒక్క నిత్యమీనన్‌ తప్ప మిగతా అందరూ ఒకొక్క సినిమాకి పరిమితమైనవాళ్లే. వీళ్లల్లో చాలా మంది వచ్చే ఆర్నెళ్లలోనూ సందడి చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెలుగు తెర తళుకుబెళుకులకు దూరమయ్యేలాగే కనిపిస్తోంది. ఇది ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయమే.

      చాలామంది హీరోయిన్లు హిందీ, తమిళం అంటూ పరభాషలపై ఆసక్తి చూపడమే అందుకు కారణంగా తెలుస్తోంది. సమంత యేటా తొలి ఆర్నెళ్లలోపు రెండు మూడు సినిమాలతో సందడి చేసేది. కానీ ఆమె ఈసారి 'సన్నాఫ్‌ సత్యమూర్తి' మాత్రమే చేసింది. ఆ తర్వాత తమిళం చెక్కేసింది. తమన్నా హిందీ సినిమాల హడావుడిలో తెలుగులో 'బాహుబలి' మాత్రమే చేసింది. రకుల్‌ రెండు చిత్రాలు చేసినా అందులో కిక్‌ 2 ఇంకా విడుదల కాలేదు. శ్రుతిహాసన్‌ కూడా కేవలం మహేష్‌ చిత్రం శ్రీమంతుడు మాత్రమే నటించింది. ఆమె కొత్తగా ఒప్పుకొన్న సినిమాలు కూడా ఏమీ లేవు. కాజల్‌ టెంపర్‌తో సందడి చేశాక చెన్నై వెళ్లిపోయింది. ఇక తిరిగివచ్చేలా కనిపించలేదు. అయితే మహేష్‌ సినిమాలో ఛాన్స్‌ అనడంతో ఓకే చెప్పేసింది. అయితే మహేష్‌ బ్రహ్మూెత్సవం కూడా వచ్చే యేడాదే ప్రేక్షకుల ముందుకొస్తుంది కాబట్టి కాజల్‌ సినిమా ఈ యేడాదికి ఒక్కటే అని ఫిక్స్‌ అయిపోవాలి. ఇలా చాలామంది కథానాయికలు అరకొర మెరుపులతో ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తున్నారు.

Tags:    

Similar News