అరెరే భామలు: రొమాన్స్‌ లేక! దానికి పనికిరాక..!!

Update: 2015-07-01 11:30 GMT
వయసు .. దాంతో పాటే తాపం రెండూ పెరుగుతాయంటారు. అయితే దానిక్కూడా ఓ సరిహద్దు ఉంది. టీనేజీలో ఉన్న స్పీడ్‌ 20లు దాటాక ఉండదు. 20లలో ఉన్న దూకుడు 30 ప్లస్‌ అయ్యాక కష్టం. వయసు పెరిగే కొద్దీ క్రమేణా శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోంది. రొమాన్స్‌పై అనాసక్తి పెరిగిపోతోంది. ఇదంతా సెక్సాలజిస్టులు మైకు పట్టుకుని మరీ చెబుతున్నారు. ఈ రోజుల్లో ఒత్తిళ్లు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. అవి శృంగార జీవితాన్ని సర్వ నాశనం చేస్తున్నాయని చెబుతున్నారు. మరి ఇప్పటికే టాలీవుడ్‌లో అరడజను మంది స్టార్‌ హీరోయిన్లు పెళ్లి పెటాకులు అనేవే లేకుండా కాలయాపన చేస్తున్నారు. అడిగితే టైమ్‌ లేదు. ప్రేమా గీమా జాన్తా నయ్‌. రొమాన్స్‌ కుదరదయ్యా బాబూ! అని సమాధానం దాటవేస్తున్నారు. అయితే ఇదంతా భామల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని చెబుతున్నారు స్పెషలిస్టులు.

    అనుష్క, కాజల్‌, తమన్నా, శ్రుతిహాసన్‌, సమంత, స్వాతి (తెలుగమ్మాయ్‌) .. ఇంతమంది భామలు పెళ్లి అనే మాట ఎత్తితే చాలు ఫైరైపోతున్నారు. పరోక్షంగా ఆసక్తి లేదని చెప్పేస్తున్నారు. అయితే ఈ భామల భవిష్యత్‌ ఏంటి? ఏమో! ప్చ్‌ .. ఇక జీవితంలో అది లేనట్టేనని కొందరు పెదవి విరిచేస్తున్నారు. వయసు దాటిపోయాక చేసేదేం లేదని అంటున్నారు.

    ఇటీవలే అనుష్క ఓ సందర్భంలో బహిరంగంగానే తన సమస్యను చెప్పింది. పెళ్లి అనే మాట ప్రతి ఒక్కరూ అడిగి మరీ హింసిస్తున్నారు. అయితే నా మిస్టర్‌ రైట్‌ దొరకాలి కదా! అయినా అంత తీరిక ఎక్కడిది. మీరే చూస్తున్నారుగా. బాహుబలి, లింగా, రుద్రమదేవి .. ఇలా ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నా. ఈ టైమ్‌లో ప్రేమ, పెళ్లి లాంటి విషయాలకు ఆస్కారం ఉందా? అని ఎదురు ప్రశ్నించింది. ఈ ప్రశ్నలోనే పెళ్లి అనే వ్యవహారంపై అనాసక్తి కనిపించింది. అదే తీరుగా కాజల్‌ పలుమార్లు అస్సలు ప్రేమించేది లేదు. పెళ్లి అసలే లేదు అని కరాఖండిగా చెప్పేసింది. ఇప్పటికే ప్రేమించి మోసపోయా. ఇంకెప్పుడూ అలాంటి బుద్ధి తక్కువ పని చేయను. అయినా మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్నతో చంపేస్తారేంటి? అంటూ విసుక్కుంది. అలాగే తమన్నా వైఖరి ఇతర భామలకంటే భిన్నం. పెళ్లికి సిద్ధమే వరుడిని వెతుకుతారా? అంటూనే క్షణం తీరికలేకుండా ఒత్తిడిని అనుభవిస్తున్నాం. ఇప్పుడేం పెళ్లి. అయినా నాకింకా బోలెడంత టైముంది అని చెప్పింది ఒకానొక సందర్భంలో.  అలాగే శ్రుతిహాసన్‌ అప్పట్లో ఓ కుర్రహీరోతో ఎఫైర్‌ సాగించిందని వార్తలొచ్చినా అలాంటిదేం లేదని ఖండించింది. పైగా పెళ్లి అనే ఆలోచన ఇప్పట్లో లేనేలేదు అని తేల్చేసింది. ఇప్పటికే కెరీర్‌ జెట్‌స్పీడ్‌తో ఉంది. ఈ టైమ్‌లో పెళ్లి అనే మాట ఎత్తడానికే భయపడుతోంది. కోట్లాది రూపాయల స్టేక్స్‌లో భాగస్వామిగా తను ఈ విషయంపై మాట్లాడడానికి అనాసక్తి కనబరిచింది. అయితే ఇటీవలే కమల్‌హాసన్‌ మాట్లాడుతూ .. మా అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే అది తన ఇష్టం. దేవుళ్లు నిర్ణయించేది పెళ్లి. తను ఎవరిని ప్రేమించినా అనుమతిస్తానని చెప్పి ఆసక్తి పెంచాడు. కానీ శ్రుతి వైఖరి మాత్రం వేరొక విధంగా ఉంది. ఇక అందాల సమంత విషయం తెలిసిందే. ఇప్పటికే హీరో సిద్ధార్థ్‌తో వ్యవహారం చెడింది. దాంతో పూర్తి అప్‌సెట్‌లో ఉన్న ఈ భామ ఇప్పట్లో ప్రేమాగీమా జాన్తా నయ్‌ అని కొట్టి పారేసింది. తెలుగమ్మాయ్‌ స్వాతి ప్రేమ, పెళ్లి గురించి స్పందిస్తూ .. అసలు నా వెంటపడే నారాజు ఎవరు? అసలు అంత టైమే లేదు. ఎవరైనా కుర్రాడు నా వెంటపడితే బావుణ్ణు అని కూడా అంది. అయితే కెరీర్‌ వేగంలో ప్రేమకు, పెళ్లికి ఆస్కారం లేదని పరోక్షంగా చెప్పింది ఈ భామ. అంతేనా ఇప్పట్లో పెళ్లిపై ఆసక్తి లేదని కూడా చెప్పింది.

    కథానాయికలపై బోలెడన్ని ఒత్తిళ్లు పనిచేస్తుంటాయనడానికి ఈ భామలే ఉదాహరణలు. పెళ్లిల్లు అక్కర్లేదు. బెడ్‌రూమ్‌లో మగనితో రొమాన్స్‌ అసలే అక్కర్లేదు.. దటీజ్‌ ఫుల్‌ క్లారిటీ బాబూ..

Tags:    

Similar News