లయన్‌ ఆడియో: చంపేశావ్‌ త్రిష

Update: 2015-04-09 15:25 GMT
హాట్‌ లుక్స్‌తో చంపేయడమంటే అది తమిళ కుట్టీ త్రిషకే చెల్లింది. మొన్నటివరకు ఒక హాట్‌స్టార్‌లెట్‌లా టాప్‌ పొజిషన్‌లో రాజ్యమేలిన త్రిష, ఆ తరువాత అనూహ్యంగా ఫ్లాపయ్యింది. అప్పుడెప్పుడో వచ్చిన ''దమ్ము'' సిఇశ్రీనమా తరువాత అసలు తెలుగులో ఈమెకు ఛాన్సులు ఇచ్చే నాదులే లేరు. ఆ తరువాత ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే వచ్చినట్లు, అమ్మడు బాలయ్య సరసన ''లయన్‌'' సినిమా దక్కించుకుంది.

ఇక సినిమాలోని పాటల్లో త్రిష గ్లామర్‌కు కొదవేం లేదు. అమ్మడు ఆరబోసింది. అయితే డైలాగులు కూడా టచ్‌లో ఉండండే అంటూ సెక్సీగా పలికింది ఈ చెన్నయ్‌ బంగారం. సూపరే సూపరే అంటూ మాస్‌ మాస్‌గా అమ్మడు స్టెప్పులేత్తంటే బాలయ్య సైతం పూనకం వచ్చినట్లు స్టెప్పులతో రెచ్చిపోయాడు. ఇకపోతే ఆడియో లాంచ్‌కు కూడా చాలా హాట్‌ హాట్‌గా డిజైనర్‌ డ్రస్‌లో కనువిందు చేసింది. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ హాట్‌గా రెచ్చిపోవాలో తెలిసిన సీనియర్‌ హీరోయిన్‌ త్రిష.
Tags:    

Similar News