త్రిష ఆనందం

Update: 2015-04-10 05:31 GMT
    తెలుగు పరిశ్రమకొచ్చి పుష్కరకాలమైనా ఇంకా తెలుగు నేర్చుకోని కథానాయిక త్రిష. ఆమె దాదాపుగా స్టార్‌ హీరోలందరినీ చుట్టేసింది. పలువురు అగ్ర దర్శకులతోనూ కలిసి పనిచేసింది. అయినా సరే.. ఎవ్వరూ ఆమెకి తెలుగు నేర్పించలేకపోయారు. ఎప్పుడు వేదికలెక్కినా నమష్కారం.. అంటూ అక్కడితో ఆపేసేది. అయితే ఇప్పుడు బాలయ్యతో కలిసి 'లయన్‌' చిత్రంలో నటించేసరికి తెలుగు గడగడా మాట్లాడేస్తోంది. ఏంటా విచిత్రం అని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. త్రిష కూడా నేను తెలుగు మాట్లాడానోచ్‌... అంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.

    చెన్నైలో పుట్టిపెరిగిన త్రిషకి తెలుగు నేర్చుకోవడం అంత కష్టమేమీ కాదు. కానీ త్రిష మాత్రం ఆ దిశగా ఎప్పుడూ దృష్టిపెట్టలేదు. సెట్‌లోనే కష్టపడి డైలాగులు బట్టీ పట్టి కెమెరా ముందు చెబుతూ కాలం గడిపింది. తీరా ఇప్పుడు కెరీర్‌ చివరి దశకు వస్తున్న సమయంలో ఆమె తెలుగుపై దృష్టి పెట్టింది. 'తెలుగులో బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్‌ మిస్సయ్యింది. ఇప్పుడు ఆ అవకాశం దొరకడం ఆనందంగా ఉంది' అంటూ 'లయన్‌' ఆడియో వేడుకలో తెలుగులోనే మాట్లాడేసింది త్రిష. ఇంకొక్క సినిమా బాలయ్యతో చేస్తే త్రిషకి మొత్తం తెలుగు వచ్చేస్తుందేమో అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News