టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నాట్య కళాకారణి అన్న విషయం తెలిసిందే. నాట్య కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సౌజన్య. ఇప్పటికే పలు వేదికలపై చాలా నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమెలోని నాట్య ప్రదర్శన గురించి గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (త్రివిక్రమ్ బంధువు) ఎంతో గొప్పగా వర్ణించేవారు. ఆమె నాట్య కళాకారిణిగా ఎదగడంలో బాబాయ్ సిరివెన్నెల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో `మీనాక్షి కళ్యాణం` నృత్య రూపక ప్రదర్శనతో మరోసారి సౌజన్య ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఇంకా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. అయితే ఇదే వేదికపై త్రివిక్రమ్ మరోసారి తన మాటలతో ఆకట్టుకున్నారు. ``ఇక్కడ ఇద్దరు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు నా భార్య సౌజన్య కాగా.. మరొకరు నా పక్కనే కూర్చుని ఉన్న పవన్ కళ్యాణ్ గారు. ఒకరు ప్రత్యక్ష ప్రసారం ఇస్తుంటే.. మరొకరు నా పక్కనే ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సాయంత్రం నాకు ఎంతో గొప్పది.. జీవితాంతం గుర్తుండిపోతుంది` అని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సౌజన్యని సోదరిగా సంబోధించి మాట్లాడారు.
``సౌజన్య శ్రీనివాస్ మీనాక్షి కళ్యాణంకి ప్రాణం పోసారు. ఇది ఓ గౌరవంగా భావిస్తున్నాను. కొరియోగ్రాఫర్ పసుమర్తి రామలింగ శాస్త్రి గారి డ్యాన్స్ ప్రజెంటేషన్ ని చూడటం ఇది రెండవసారి. సాధారణంగా ఈ వేదిక సినిమా ఫక్షన్ లది. హాల్ మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అలాంటి సన్నివేశమే కనిపిస్తోంది. ఇలా గొప్ప స్పందనతో నాట్య కళాకారుల్ని ఎప్పుడూ గౌరవించుకోవాలి. సంప్రదాయాలు..మూలాలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం``అని పవన్ అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు చూస్తున్నప్పుడల్లా దేవుళ్లే భుమిపైకి దిగొచ్చి నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ పవన్ ప్రశంసలు కురిపించారు.