రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసిన పూరి జగన్నాధ్ ఏదో కారణం చెబుతూ ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చాడు. గత నెల రోజులుగా చేస్తున్న పబ్లిసిటీ హంగామా నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఉత్తర భారతంలో కూడా లైగర్ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయడంకు కరణ్ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. హిందీ సినిమాల కంటే కూడా అధికంగా ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు అది కాకుండా తెలుగు సినిమా లు ఉత్తర భారతంలో ఆడుతున్నాయి. కనుక ఆ ఆశతో లైగర్ సినిమా ను అక్కడ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా ను 2 గంటల 20 నిమిషాల నిడివితో దర్శకుడు పూరి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ సినిమాలన్నీ కూడా దాదాపుగా మూడు గంటలు ఉంటున్నాయి. కొన్ని సినిమాలు రెండున్నర గంటలు ఉంటున్నాయి ఇప్పుడు లైగర్ సినిమా రెండున్నర గంటల కంటే తక్కువ నిడివితో రాబోతుండటం చర్చనీయాంశంగా మారింది.
పూరి సినిమా అంటే సాగతీత లేకుండా సూటిగా సుత్తి లేకుండా అన్నట్లుగా ఉంటుంది. లైగర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నా.. భారీ బడ్జెట్ తో రూపొందినా కూడా ఈ సినిమాలో కూడా సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్ ను పూరి చెప్పే విధంగా స్క్రీన్ ప్లే ను ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. రెండున్నర గంటల కంటే కూడా తక్కువ నిడివి తో రావడం అనేది లైగర్ కి పెద్ద ప్లస్ పాయింట్ గా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ వంటి మాస్ హీరో.. యూత్ ఫుల్ హీరోతో రెండున్నర గంటల సినిమా అంటే ప్రేక్షకులకు ఫుల్ వినోదం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం లైగర్ యొక్క రన్ టైమ్ గురించి ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్నంత మాత్రాన సినిమా గొప్పగా ఉంటుందని ఏమీ లేదు.
ఉన్నంతలో ప్రతి సన్నివేశం ఆకట్టుకునే విధంగా ఉంటే అప్పుడు సినిమాకు మంచి టాక్ వస్తుంది అనేది గత సినిమాల అనుభవం చెప్పకనే చెబుతోంది. కనుక లైగర్ సినిమా కు రన్ టైమ్ పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చి పెట్టే అవకాశం ఉంది.