ఇవేం కామెడీల్రా నాయనా!?

Update: 2016-11-23 01:30 GMT
ఓ హీరోను చంపేద్దామని అనుకుంటున్నట్లు.. తోటి కుర్ర హీరోలు చెప్పడం అంటే చాలా పెద్ద మేటర్. పోటీ కారణంగా ఓ రేంజ్ వరకూ విబేధాలు.. పైపై మాటలు పంచ్ లు పడుతూనే ఉంటాయ్. కానీ పక్క హీరోని ఓపెన్ గా పొగిడేసే బాపతు కూడా ఉంటారు. ఈ కల్చర్ బాలీవుడ్ లో బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రణవీర్ సింగ్ ను ఇలా పొగడ్డంలో.. ఎక్స్ ట్రీమ్ లెవెల్ ను చూపించేశారు అర్జున్ కపూర్.. వరుణ్ ధావన్.

దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమం రీసెంట్ ఎపిసోడ్ కి అర్జున్.. వరుణ్ లు ఇద్దరూ వచ్చారు. ఓ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. 'ఇప్పుడున్న వారిలో రణవీర్ చాలా చాలా ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్. వరుస సినిమాలు-సక్సెస్ లో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. రణవీర్ దూకుడు కారణంగా పోటీ పెరిగిపోతోంది. అందుకే రణవీర్ ను చంపెయ్యాలని మేమిద్దరం డిసైడ్ అయ్యాం. అప్పుడు మాకు అడ్డు తొలగిపోతుందని మా ఫీలింగ్' అంటున్నారు వరుణ్ ధావన్.. అర్జున్ కపూర్ లు.

ఎంత కామెడీ అయితే మాత్రం.. మరీ చంపేస్తాం అని చెప్పడం మాత్రం టూమచ్ అనాల్సిందే. రణవీర్ సింగ్ తన ప్రేయసి దీపికా పదుకొనేతో కలిసి.. త్వరలో ఇదే కార్యక్రమానికి రానున్నారు. ఈ ఇద్దరు కుర్ర హీరోలు వేసిన పంచ్ లు.. కౌంటర్లకు.. రణవీర్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News