మెగా ప్రిన్స్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే వరుణ్ తేజ్ 'F2' విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుణ్ తేజ్ రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వాల్మీకి'.. రెండో సినిమా డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకుడు రూపొందించే స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా కోసం అమెరికాలో రెండు నెలలపాటు ఒక ఒలింపిక్ విన్నర్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్ తర్వాత వరుణ్ స్లిమ్ గా.. సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోకు వరుణ్ ఇచ్చిన క్యాప్షన్ "బిజీగా ఉండే వారం మొదలు #వర్క్ వర్క్ వర్క్". ఈ ఫోటోలో వరుణ్ లుక్ అదిరిపోయిందంటే నమ్మండి. గుబురుగా ఉన్న గడ్డం.. మెలిదిప్పిన మీసాలు.. కొంచెం పొడవుగా ఉన్న జుట్టుతో గ్రీకు వీరుడిలా ఉన్నాడు. వైట్ షర్టు వేసుకొని పై బటన్లు పెట్టుకోకుండా ఉండడంతో మ్యాన్లీ లుక్ లో కనిపిస్తున్నాడు.
ఈ ఫోటోకు నెటిజనుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒకరు 'బెస్ట్ బియర్డ్ ఆ టీఎఫ్ ఐ' అని కితాబిస్తే మరొకరు 'హాయ్ హ్యాండ్ సమ్' అంటూ పలకరించారు. ఒక నెటిజనుడు "రానా దగ్గుబాటిలా ఉన్నావు వరుణ్" అంటూ తన ఒపీనియన్ తెలిపాడు. ఏదైతేనేం.. వరుణ్ మాత్రం ఓవరాల్ గా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ఫిక్స్ అయిపోండి.. నెక్స్ట్ సినిమాల్లో వరుణ్ లుక్ కేక పుట్టించడం ఖాయమే.