మెగా ఫ్యామిలీ నుంచి లేటుగా.. దాదాపుగా ఒకే సమయంలో తెరంగేట్రం చేశారు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. వరుణ్ తేజ్. వీళ్లిద్దరి తొలి సినిమాలు ఏమంత మంచి ఫలితాన్నివ్వలేదు. తేజు తొలి సినిమా ‘రేయ్’ అతడిని ఏ స్థాయిలో దెబ్బ తీసిందో తెలిసిందే. వరుణ్ తొలి సినిమా ‘ముకుంద’ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఐతే తన అరంగేట్ర సినిమా ఆలోచనల్లోంచి బయటకు వచ్చేసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లతో మంచి రేంజికి చేరుకున్నాడు తేజు. హ్యాట్రిక్ హిట్లతో అతను దాదాపుగా స్టార్ అయిపోయాడు.
ఐతే తేజు ఇలా ఎదుగుతున్నపుడు వరుణ్ పరిస్థితి ఏమంత బాగా లేదు. రెండో సినిమా ‘కంచె’ నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టినా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘లోఫర్’ అతడిని దారుణమైన దెబ్బ కొట్టింది. ఆపై ‘మిస్టర్’ వరుణ్ కెరీర్ ను మరింతగా వెనక్కి లాగింది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. ‘మిస్టర్’ కంటే ముందు రిలీజైన తేజు మూవీ ‘విన్నర్’ కూడా ఫ్లాపే అయినప్పటికీ ఆ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. తేజు మార్కెట్ ఒక స్టార్ హీరో స్థాయిలో కనిపించిందప్పుడు. కానీ ఏడాది తిరిగే సరికి పరిస్థితి తల్లకిందులైంది. నిరుడు ‘ఫిదా’తో బ్లాక్ బస్టర్ కొట్టిన వరుణ్.. మార్కెట్ పెంచుకున్నాడు. ఆ ప్రభావం ‘తొలి ప్రేమ’పై పడింది. ఈ సినిమాకు తొలి రోజే రూ.5 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. అదే సమయంలో దీనికి పోటీగా రిలీజైన తేజు సినిమా ‘ఇంటిలిజెంట్’ అందులో సగం షేర్ కూడా తెచ్చుకోలేదు. ఏడాది ముందు తేజు స్టార్ లాగా కనిపించాడు. వరుణ్ అతడి ముందు చాలా వీక్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది.