మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ యాక్షన్ చిత్రం 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఊక వేస్తే రాలనంత మంది అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది.
ఈ ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ- మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ పరిశ్రమలో రావాలని వాల్తేరు వీరయ్య- వీరసింహారెడ్డి చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఇదే తొలిసారి అని నిర్మాతలకు తమ ఎంపికలపైనా కంటెంట్ పైనా నమ్మకం ఉందని చిరు అన్నారు.
ఇలాంటి రికార్డ్ నిర్మాణ సంస్థ వేరొకటి లేదని కితాబిచ్చారు. ఏజ్ గ్రూప్- క్లాస్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా వాల్తేరు వీరయ్య అందరినీ అలరిస్తుందని చిరు అన్నారు. ఇదొక కమర్షియల్ సినిమా అని తెలిపారు.
వాల్తేరు వీరయ్య ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. సినిమా విజయంపై చిరు చాలా నమ్మకంగా ఉన్నాం. బాబీ సినిమా ఔట్ పుట్ కోసం చాలా బాగా పనిచేశారని -తన పనితో ఎప్పుడూ సంతృప్తి చెందకుండా నిరంతరం పని చేస్తూనే ఉన్న దర్శకుడు చాలా విజయవంతమవుతాడని చిరు అన్నారు.
బాబీ కష్టానికి నేను అభిమానిని అని చిరు ప్రశంసించారు. రవితేజ ఎప్పుడూ అల్లరి చేసేవాడని .. మాస్ మహారాజాగా మరో స్థాయికి ఎదిగాడని మెగాస్టార్ సరదాగా అన్నారు. మాస్- క్లాస్ రెండూ ఉండే రవితేజ సినిమాలను చూస్తానని చిరు అన్నారు. సినిమాలో శృతిహాసన్ బాగా నటించిందని చిరు అన్నారు. సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపిన చిరు ఈవెంట్ ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ముఖ్యంగా తన స్పీచ్ లో వీరసింహారెడ్డి విజయం సాధించాలని వీరయ్య బ్లెస్సింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
వీరసింహారెడ్డి జనవరి 12న థియేటర్లలో విడుదలవుతుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలవుతోంది. ఒక రోజు గ్యాప్ తో వస్తున్న ఈ సినిమాలు ఓపెనింగులు షేర్ చేసుకుంటాయనడంలో సందేహం లేదు. ఈ రెండు సినిమాలకు బజ్ బావుంది. ఆడియెన్ లో భారీ హైప్ నెలకొంది. ట్రైలర్లతో అందరూ సంతృప్తిగా ఉన్నారు. సంక్రాంతి కోలాహాలం చాలా ముందే మొదలైపోవడానికి ప్రీరిలీజ్ ఈవెంట్ల విజయం ఒక ప్రధాన కారణం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.