ఇటీవలే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్-అతని తండ్రిని బెదిరిస్తూ ఓ లేఖ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెదిరింపులకు పాల్పడ్డవారిని విచారించడం జరిగింది. తాజగా ఆ ఘటన మరువక ముందే మరో బెదిరింపు వ్యవహారం బాలీవుడ్ కలకం రేపుతోంది.
స్టార్ కపుల్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ లను చంపేస్తామంటూ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇద్దర్నీ జంటగా చంపేస్తానంటే ఓ ఆగంతకుడు ఈ ఘటనకు పాల్ప్పడ్డాడు. దీంతో అలెర్ట్ అయిన ఆ జంట ముంబైలోని శాంతాక్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఐటీ యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విక్కీ-క్యాట్ జంటకు పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు వచ్చిన రెండవసారి బెదిరింపు కాల్ ఇది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా-గ్యాంగ్ స్టర్ల నుంచి ఎవరైనా ఈ బెదిరింపులకు పాల్పడ్డారా? అన్న కోణంలో ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే పంజాబీ సింగర్ సిద్ధూ హత్య కేసులో గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్టోయ్ ప్రధాన నిందుతుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
పోలీసుల కస్టడీలో ఉన్న సిద్దుని విచారించగా సల్మాన్ ని బెదిరించింది కూడా అతనేని వెలుగులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతలో విక్కీ-క్యాట్ జంటకు బెదిరింపులు రావడంతో బాలీవుడ్ మరోసారి భయం గుప్పిట్లోకి జారుకుంది.
అయితే ఇలాంటి బెదిరింపులు బాలీవుడ్ కి కొత్తేం కాదు. గతంలో అమీర్ ఖాన్..షారుక్ ఖాన్ లకు సైతం ఇలాంటి బెదిరింపులు ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి గతంలో మాదిరి కాకుండా సీవియర్ గా ఉండటంతో పోలీసులు బెదిరింపులు ఎదుర్కొన్న సెలబ్రిటీలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు.