బసవతారకం.. ఇందిరమ్మ.. జయలలిత.. ఈ పాత్రలన్నిటికీ ఒకే ఒక్కరు పెర్ఫెక్ట్ ఆప్షన్. దటీజ్ విద్యాబాలన్? ఇంట్రెస్టింగ్ కదూ? బాలన్ లో ఉన్న గ్లింప్స్ అలాంటిది. డర్టీపిక్చర్ తో డర్టీగాళ్ ఇమేజ్ వచ్చినా పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన ప్రభుత్వాల సాక్షిగా.. ఇప్పుడు బాలన్ కెరీర్ మరో లెవల్ ని టచ్ చేస్తోంది. అసలు ఈవిడలోని డర్టీ కంటే ఆ ఈజ్ ని మెచ్చిన ఫ్యామిలీ జనం `తుమ్హారీ షులూ` చిత్రంలో గృహిణి పాత్రలో నటించినప్పుడు అంతే బ్రహ్మరథం పట్టారు.
ఇప్పుడు అంతకుమించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది విద్యాబాలన్. బహుభాషా చిత్రాల ట్రెండ్ లో - మల్టీస్టారర్ ట్రెండ్ లో కాస్టింగ్ ఎంపికల్లో హద్దులు చెరిగిపోయాయ్. ఇన్నాళ్లు సౌత్ నాయిక - నార్త్ కథానాయిక అంటూ మాట్లాడుకునే జనం ఆ బార్డర్ ని చెరిపేసి మన హీరోయిన్నే అంటూ కలిపేసుకుంటున్నారు. ముంబై నుంచి వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటిస్తోంది అనగానే బాలన్‌ని తెలుగు జనం వోన్ చేసేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాతో తెలుగు నాయికగా వెలిగిపోతుంది. అటుపై మరో క్రేజీ ఆఫర్. భారతదేశ మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ లీడర్ ఇందిరాగాంధీ పాత్రతో మరింతగా దేశవ్యాప్తంగా అన్ని రెజియన్లకు పరిచయం అయిపోతోంది బాలన్. అది వెబ్ సిరీస్ అయినా ఇందిరమ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోవర్స్ లో ప్రకంపనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పుడు ఏకంగా బాలన్‌కి వేరొక అద్భుతమైన పాత్రలో అభినయించే ఆస్కారం లభించిందన్న క్లూ దొరికింది. మహానటి సావిత్రి తర్వాత సౌత్ లో అగ్రకథానాయికగా వెలిగిన జయలలిత పాత్రలో విద్యాబాలన్ అభినయించనున్నారని తెలుస్తోంది. గొప్ప కథానాయికగా వెలుగులు విరజిమ్మిన జయలలిత అటుపై రాజకీయాల్లోకి వచ్చి ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. అలాంటి మహోన్నత నటి - నాయకురాలి పాత్రలో బాలన్ అయితే సరిపోతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. బాలన్ లోని బబ్లీ లుక్ జయలలిత పాత్రకు సూటబుల్ అన్న మాటా వినిపిస్తోంది. పైగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఆ సినిమాని తీస్తున్నారు కాబట్టి బాలన్ నే ఈ పాత్రకు సంప్రదించే ఛాన్సుందని భావిస్తున్నారు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జయలలిత జయంతి 24 ఫిబ్రవరి రోజున ప్రారంభం కానుంది. అధికారికంగా టైటిల్ పాత్రధారిని - ఇతరత్రా కాస్టింగ్ వివరాలు ప్రకటించాల్సి ఉందింకా.