‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగి స్టార్ హీరో గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రతిష్టాత్మక చిత్రం మహానటి లో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అలనాటి దేవదాసు పాత్రలో మోడ్రన్ దేవదాసు నటించబోతున్నాడని వినికిడి. తనకు సన్నిహితుడైన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెండోసారి విజయ్ నటిస్తున్నాడు. అయితే, తాజాగా విజయ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యానని విజయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ట్రైనర్ తో కలిసి ఉన్న ఫొటోను కూడా విజయ్ షేర్ చేశాడు.
విజయ్ సిక్స్ ప్యాక్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ‘ట్రైనర్ కులదీప్ వద్ద శిక్షణ పొందుతున్నా. నా శరీరంతో ప్రయోగం చేస్తున్నా. ఈ ప్రయోగం ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం’ అని పోస్ట్ చేశాడు. ట్రైనర్ కులదీప్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని ట్రైనర్ కులదీప్ ప్రస్తావిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘విజయ్ దేవరకొండ మరో ఛాలెంజ్ కు అంగీకరించాడు. ‘అర్జున్ రెడ్డి’ సిక్స్ ప్యాక్ చేసేందుకు, 360 డిగ్రీస్ ఫిట్ నెస్ కు అంగీకరించాడు’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే, విజయ్...సిక్స్ ప్యాక్ చేస్తున్నది మహానటి చిత్రం కోసమా? లేక వేరే చిత్రం కోసమా అన్న సంగతి తెలియాల్సి ఉంది.