ఇది బయోపిక్ ల కాలం.. వరుసగా వచ్చిన బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్స్ కొట్టాయి. నాటి తారల కష్టసుఖాలను నేటి ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ బయోపిక్ లు కలెక్షన్ల వర్షం కురిపించాయి. అందుకే ఇప్పుడు తమిళనాట మరో బయోపిక్ కు రంగం సిద్ధమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి .. సినీ ఇండస్ట్రీని ఏలిన అగ్ర తార జయలలిత బయోపిక్ ను తీయడానికి అడుగులు పడినట్టు తెలిసింది. జయలలిత మరణించగానే ఆమె బయోపిక్ తీస్తానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఆ మాటే ఎత్తడం లేదు. ఇక బతికున్నప్పుడు దాసరి నారాయణ రావు కూడా జయలలిత బయోపిక్ తీస్తానని.. ఆ కోరిక తీర్చకుండానే చనిపోయారు. ఇక జయలలిత బయోపిక్ ఉండదు అనుకుంటున్న తరుణంలో టాలీవుడ్ నిర్మాత సీ. కళ్యాణ్ ముందుకొచ్చారు.
ఇటీవల లక్ష్మీ ఆడియో వేడుకలో నిర్మాత సీ.కళ్యాణ్ త్వరలోనే ఓ సంచలన చిత్రం తీయబోతున్నట్టు ప్రకటించారు.అది జయలలిత బయోపిక్ అని సమాచారం. తమిళ దర్శకుడు విజయ్ జయలలిత జీవిత కథను రూపొందిస్తారని.. త్వరలోనే దీన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలిసింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించిన జయలలిత సినిమాను ఈ మూడు భాషల్లోనూ విడుదల చేయనున్నట్టు సమాచారం. జయలలిత పాత్రలో దక్షిణాది అగ్రహీరోయిన్ ను నటింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.