సరిగా తీయలేదన్న బాహుబలి రైటర్

Update: 2017-09-21 06:19 GMT
బాహుబలి.. భజరంగీ భాయ్ జాన్ మూవీస్ కి రచయితగా.. దేశవ్యాప్తంగా స్టార్ రైటర్ స్టేటస్ దక్కించుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ఈయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీవల్లి.. రీసెంట్ గా రిలీజ్ అయింది. బాహుబలి రైటర్ నుంచి వచ్చిన చిత్రంగా జనాల్లో అంతో ఇంతో ఆసక్తిని కలిగించింది. అలాగే రాజమౌళి కూడా తన తండ్రి సినిమా కోసం ఇతోధికంగా మాట సహాయం చేసి పెట్టారు.

అయితే.. ఈ సినిమా జనాలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. అసలు మూవీ చూసిన జనాలకు..తాము ఏ జోనర్ చిత్రం చూస్తున్నామో కూడా అర్ధం కాని పరిస్థితి. ఈరోటిక్.. లెస్బియన్.. ఫ్యాంటసీ - పీరియాడిక్.. ఇలా అన్ని జోనర్ లను కలిపి తీసేసిన శ్రీవల్లి ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని ఓపెన్ గానే అంగీకరిస్తున్నారు విజయేంద్ర ప్రసాద్. తాను ఈ చిత్రానికి సరిగా దర్శకత్వం వహించకపోవడం కారణంగానే శ్రీవల్లి ఆదరణ పొందలేదని అంటున్నారు.

"శ్రీవల్లి చిత్ర కథ ఆకట్టుకునేదే. నిర్మాతలు కూడా నన్ను నమ్మి భారీ మొత్తాన్నే ఇన్వెస్ట్ చేశారు. నటీనటులు కూడా ఎంతో కష్టపడ్డారు. కానీ నేను అంచనాల మేరకు ఈ చిత్రాన్ని తెరకెక్కించలేకపోయాను. మరింత బాగా తీయాల్సి ఉంది" అంటూ శ్రీవల్లి ఫ్లాప్ కు సంబంధించిన భారాన్ని బాధ్యతను తన పైనే వేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్.  


Tags:    

Similar News