ఆ బికినీ ఫోటో వెనుక నిజం అదే

Update: 2018-01-31 02:30 GMT
బాలీవుడ్ లో వచ్చినట్టుగా రూమర్స్ మరెక్కడా రావు అనేది అందరికి తెలిసిన విషయమే. బాలీవుడ్ స్టార్స్ ఏ అమ్మాయితో కనిపించినా డేటింగ్ అనేస్తారు. ఇక హీరోయిన్స్ ఎవరితో సెల్ఫీ దిగినా బాయ్ ఫ్రెండ్ ని పెట్టేసిన బ్యూటీ అంటూ క్యాప్షన్స్ ఇస్తుంటారు. ఇలాంటి న్యూస్ లు రోజు పదుల సంఖ్యలో వస్తుంటాయి. ఫొటోలు దొరకడమే తక్కువ.. వెంటనే టైటిలే ఇచ్చేస్తారు. రీసెంట్ గా ఒక హీరో కూతురికి అలాగే బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ కి కూడా అదే పేరు పెట్టారు.

చాలా వరకు తారలు ఈ మధ్య కాలంలో రూమర్స్ కి ఎక్కువగా స్పందించడం లేదు. ఎవరైనా స్పందిస్తే అలా ఎందుకు చెప్పింది అని మరో పెంట. దీంతో సైలెంట్ గా ఉంటే రెండు రోజులకు ఎవరో కొత్త వారు దొరగ్గానే మనల్ని మరచిపోతారు అనుకోని సైలెంట్ గా ఉంటారు. కానీ రీసెంట్  గా ఒక నటుడు మాత్రం వివరణ ఇచ్చాడు. సైఫ్ అలి ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ వికాస్ గుప్త తో ఫొటో దిగింది. అయితే ఆ ఫొటో పై రూమర్స్ రావడానికి కారణం సారా బికినీతో ఉండడం.

దీంతో సోషల్ మీడియాలో కూడా వారిద్దరి మధ్య అనేక రూమర్స్ వచ్చాయి. అయితే రీసెంట్ గా వికాస్ ఫొటోపై వివరణ ఇచ్చాడు. సారా మరియు నేను పాండిచ్చేరిలో ఫ్యాషన్ కి సంబంధించిన కొన్ని వర్క్ షాప్స్ లలో పాల్గొన్నాం . 10-15 రోజుల వరకు ఆ వర్క్ కొనసాగింది. మేము అక్కడ చాల ఫ్రెండ్స్ గా మారాం. ఆ తరహాలోనే కలిసి ఒక ఫొటోకి స్టిల్ ఇచ్చం. ఆ ఫోటోని సారా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం తో నేను స్క్రీన్ షాట్ తీసుకొని నేను షేర్ చేసుకున్నా అని వివరణ ఇచ్చాడు.
Tags:    

Similar News