సినిమా పరిశ్రమలో వారసుల ఎంట్రీ సర్వసాదారణం. నెపొటిజం అంటూ ఎందరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా కూడా స్టార్ వారసులు అయితే సినిమాల్లో నటించేందుకు పనికి రారా అంటూ పలువురు హీరోలుగా పరిచయం అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు అయిన ధృవ్ హీరోగా ఇప్పటికే పరిచయం అయ్యాడు. మొదటి సినిమాగా అర్జున్ రెడ్డి రీమేక్ ఆధిత్య వర్మను చేశాడు. ఆ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. నటుడిగా ధృవ్ కు పేరు తెచ్చి పెట్టింది. కాని ఒక మంచి కమర్షియల్ హీరోగా స్టార్ హీరోగా మాత్రం ధృవ్ కు పేరు రాలేదు. కొడుకును స్టార్ హీరోగా నిలిపేందుకు విక్రమ్ రంగంలోకి దిగాడు.
ధృవ్ రెండవ సినిమాలో విక్రమ్ విలన్ పాత్రను చేయబోతున్నాడు. కెరీర్ లో ఎప్పుడు కనిపించని పాత్రలో విక్రమ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన హీరో కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా కొడుకు కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని చియాన్ విక్రమ్ చేసేందుకు సిద్దం అయ్యాడు. కొడుకు హీరోగా తండ్రి విలన్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారట.
గతంలో పలు రకాల పాత్రలు చేసిన విక్రమ్ ఈసారి కొడుకు సినిమాలో చేయబోతున్న పాత్ర మాత్రం అత్యంత విభిన్నంగా ఉంటుందని ఒక వేళ ఈ సినిమా కనుక నిరాశ పర్చితే విక్రమ్ కెరీర్ ప్రమాదంలో పడ్డట్లు అవుతుందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయినా బెదరకుండా విక్రమ్ ఈ సినిమాను చేస్తున్నాడు. విక్రమ్ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. కొడుకు కెరీర్ ను నిలబెట్టేందుకు విక్రమ్ చేస్తున్న ఈ సాహసం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.