గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ కి బ్యాడ్ టైమ్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అతడు రకరకాల రాంగ్ రీజన్స్ తో వార్తల్లో నిలుచాడు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీపై బయోపిక్ తెరకెక్కించడం వివాదాస్పదమైంది. ప్రధాని పాత్రలో నటించిన ఒబేరాయ్ ఆ సినిమాకి తనే స్వయంగా పెట్టుబడులు పెట్టడంతో ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నాడని.. ఫలితాలకు ముందు రిలీజ్ కి ప్రత్యర్థి పార్టీలు అభ్యంతరం చెప్పాయి. దాంతో ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన `పీఎం నరేంద్ర మోదీ` చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. కోర్టుల పరిధిలో ఎంత పోరాడినా ఈసీ వ్యతిరేకించడంతో రిలీజ్ కి పనవ్వలేదు. నిన్నటిరోజున ఎన్నికల రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మే 24న రిలీజ్ చేస్తున్నామని ఒబేరాయ్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.
అదంతా ఒక కోణం అనుకుంటే.. సరిగ్గా ఎలక్షన్ ముందు మరో ఊహించని వివాదంలో ఇరుక్కుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు ఒబేరాయ్. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఫోటోతో మీమ్స్ చేసి జోక్ వేయబోతే అది కాస్తా బెడిసి కొట్టింది. అతడి మెడకు వివాదాల గుదిబండలా చుట్టుకుంది. ఒకరి భార్యపై మీమ్స్ పేరుతో జోకులు వేసే హక్కు ఒబేరాయ్ కి ఎవరిచ్చారు? ఎంత మాజీ ప్రేయసి అయితే మాత్రం మరీ ఇలా భరితెగిస్తారా? అంటూ సాటి నటీనటులే చీవాట్లు పెట్టారు. సోనమ్ కపూర్- ఊర్మిల మటోండ్కర్ - మధుర్ భండార్కర్ వంటి ప్రముఖులు వివేక్ ఒబేరాయ్ చేసిన పనిని తప్పు పట్టారు. వెంటనే ఆ మీమ్స్ ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించి సారీ చెప్పాల్సొచ్చింది. అంతేకాదు చేసిన తప్పుకు శిక్ష తప్పదు అంటూ మహారాష్ట్ర మహిళా కమీషన్ అతడికి నోటీసులు పంపించడంతో అది కాస్తా అంతకంతకు రచ్చవుతోంది.
ప్రస్తుతం ఈ గొడవల్లో నలుగుతుండగానే మరో ఊహించని బెదిరింపు ఫోన్ కాల్ ఒబేరాయ్ ని కంగారు పెట్టింది. ఈసారి `చంపేస్తాం` అంటూ వార్నింగ్ అందుకున్నాడు. అది నక్సలైట్స్ నుంచి వచ్చిన థ్రెట్ కాల్ అంటూ చెబుతున్నారు. ఆ కాల్ రాగానే అతడికి వెంటనే ముంబై పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ని రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈ బెదిరింపులు వచ్చాయా? అంటూ పోలీస్ ఆరాలు తీస్తున్నారు. మొత్తానికి ఒబెరాయ్ పై నాలుగు వైపులా కక్ష కట్టినవాళ్లు ఎటాక్ కి రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఇక్కడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్జీవీ తెరకెక్కించిన `రక్తచరిత్ర`లో అతడు తేదేపా నాయకుడు పరిటాల రవి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.