కోవిడ్-19 నేపథ్యంలో సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవడం.. థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. థియేటర్స్ తెరుస్తున్నప్పటికి.. థియేట్రికల్ రిలీజ్ కి ఎవరూ ముందుకు రాలేదు. 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్ తెరవాలనే కండీషన్ ఉండటంతో సినిమాకి రిటర్న్స్ వస్తాయో రావో అనే ఆలోచనతో వెనకడుగు చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ తెలుగు సినిమా బిజినెస్ కి ఆయువుపట్టు లాంటి ఓవర్ సీస్ మార్కెట్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయనే డౌట్ కూడా ఉంది. దీంతో ఓవర్ సీస్ లో సినిమా విడుదల అవ్వకుండా కేవలం ఇండియాలోనే సినిమా విడుదలైతే పరిస్థితి ఎంటనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
ఇండియాలో సినిమాని ముందు రిలీజ్ చేసి ఓవర్ సీస్ లో ఆ తరువాత రోజు విడుదల చేసినా ఆ ప్రభావం బుకింగ్స్ మీద కనిపించే అవకాశం ఉంది. 80 శాతం బుకింగ్స్ పడిపోయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఫైరసీ.. రేటింగ్స్.. రివ్యూస్ కారణంగా ఓవర్ సీస్ లో సినిమా రిలీజ్ లేట్ అయితే మాత్రం అక్కడ డిస్ట్రీబ్యూటర్లు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాను నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రానికి ఓవర్ సీస్ రిలీజ్ విషయంలో ఏదో ఇబ్బంది ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా థియేటర్స్ లో విడుదల అవ్వడం ఖాయమని జీ స్టూడియోస్ వారు ప్రకటించేశారు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చే స్పందనను బట్టి మరికొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజులను ప్రకటించే అవకాశం ఉంది.