టాలీవుడ్ హీరోల్లో మూడు గ్రేడ్ లలో హీరోలు డివైడ్ అయి ఉన్నారు. టైర్ -1..టైర్-2..టైర్-3 ఇలా మూడు విభాగాలున్నాయి. స్టార్ హీరోలు..మీడియం రేంజ్ హీరోలు.. బిలో మీడియం రేంజ్. స్టార్ హీరోల ర్యాంక్..బడ్జెట్ సహా ఈ కేటగిరిలోకి వస్తాయి. బిలో యావరేజ్ హీరోలు..మీడియం రేంజ్ హీరోలు టైర్ -1 జాబితాలో స్థానం సంపాదించింది కొంతమందైతే..మిగతా జాబితాల్లో మరికొంత మంది ఉన్నారు.
కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఇంకా మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయాడా? అంటే అవుననే తెలుస్తోంది. నాని టాలీవుడ్ కి ఉవ్తెత్తున దూసుకొచ్చారు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. ఇమేజ్ సహా పాలోయింగ్ ని ఎంతో మెరుగుపరుచుకున్నారు.
ఒకానొక దశలో నాని టైర్ -1 జాబితాకి చాలా దగ్గరగా ఉన్నాడు అనిపించింది. సక్సెస్ లు సహా అతనికున్న క్రేజ్ ఆధారంగా ఆ స్థానానికి రీచ్ అయ్యారు. కానీ నాని తాజా పరిస్థిని విశ్లేషిస్తే తిరోగమనంలో కనిపిస్తున్నారు. నానికి సరైన హిట్ పడి ఐదేళ్లు అవుతుంది. 'ఎంసీఏ' తర్వాత చాలా సినిమాలు చేసారు. వాటికి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రాలు వసూళ్ల విషయంలో వెనుకబడే ఉన్నాయి. ఆ రకంగా ఆ చిత్రాలేవి కమర్శియల్ సక్సెస్ ని అందుకోలేదని చెప్పాలి.
ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో నటిస్తున్నారు. అదీ కొత్త దర్శకుడితో చేస్తోన్న సినిమా. ఇలా కొత్త వాళ్లకి అవకాశాలు కల్పించడంలో చొరవ చూపించడం బాగానే ఉందిగానీ...ఆ ప్రభావం నాని మార్కెట్ పై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కమర్శియల్ సక్సెస్ లకి నాని సినిమాలు దూరమవ్వడంతో క్రమేణా మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది.
సేఫ్ జోన్ కంటెంట్ ని ఎంపిక చేసుకుటున్నా అంతమంగా బాక్సాఫీస్ రిజల్ట్ అన్నదే కీలకం కాబట్టి రేసులో నాని వెనుకబడిపోతున్నాడే విమర్శ తెరపైకి వస్తోంది. తన కన్నా వెనుకొచ్చిన హీరోలు టైర్ -1 జాబితాలో చేరడానికి దగ్గరగా ఉన్నా.. విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు ఆ జాబితాలో చేరినా నాని ఇంకా చేరకపోవడానికి కారణం ఏంటి? అని విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వినిపిస్తుంది.
నాని సీనియర్ దర్శకులకు అవకాశం ఇవ్వలేదా? వాళ్లే నానికి ఛాన్స్ ఇవ్వడం లేదా? అన్న కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి వీటన్నింటికి నాని ఎలాంటి బధులిస్తాడో చూద్దాం.